సచిన్ బన్సల్
స్వరూపం
సచిన్ బన్సల్ | |
|---|---|
| జననం | 1981 ఆగస్టు 5 చండీఘర్ |
| జాతీయత | భారతీయుడు |
| పాఠశాల/కళాశాలలు | ఐఐటీ ఢిల్లీ |
| వృత్తి | వ్యాపారవేత్త |
| పేరుపడ్డది | ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్, సియిఓ |
| భాగస్వామి | ప్రియ బన్సల్ |
సచిన్ బన్సల్ ఒక భారతీయ వ్యాపారవేత్త. భారత ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు.[1][2][3] ఫ్లిప్‌కార్ట్ లో ఉన్న 11 సంవత్సరాలు సచిన్ ఆ సంస్థకు ఛైర్మన్, సీఇవో గా ఉన్నాడు. 2018లో ఫ్లిప్‌కార్ట్ ను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజమైన వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశాడు.[4][5] 2014 నుంచి 18కి పైగా సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. ఓలా క్యాబ్స్, గ్రే ఆరెంజ్, ఏథర్ ఎనర్జీ, ఇన్ షార్ట్స్, అనకాడెమీ వీటిలో కొన్ని.
2007 సంవత్సరంలో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ (బంధువులు కాదు) కలిసి ఫ్లిప్‌కార్ట్ ను స్థాపించారు. 2018 నాటికి ఆ సంస్థ విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉంది. అప్పటికి బన్సల్ కు ఆ సంస్థలో 5.5 శాతం వాటా ఉంది. దాన్ని వాల్‌మార్ట్ కు విక్రయించాడు. అతని ఆస్తుల విలువ సుమారు 1 బిలియన్ డాలర్లు అయ్యింది.
మూలాలు
[మార్చు]- ↑ "ET Awards 2012-13: How IIT-alumnus Sachin Bansal built Flipkart into a big online brand". The Economic Times. ET Bureau. September 26, 2013. Retrieved April 8, 2019.
- ↑ "Sachin Bansal, Binny Bansal". CNBC. October 6, 2014. Retrieved April 8, 2019.
- ↑ "Meet the 9 richest Indian tech billionaires". The Economic Times. Retrieved 2020-09-29.
- ↑ Nair, Radhika (August 9, 2013). "Do not start alone, find a co-founder: Sachin Bansal, Flipkart". The Economic Times. Retrieved April 8, 2019.
- ↑ "Sachin Bansal quits Flipkart as Walmart wanted only one founder on board". The Economic Times. May 10, 2018. Retrieved April 8, 2019.