సత్యవోలు (రాచర్ల)
సత్యవోలు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°27′50″N 78°57′47″E / 15.463773°N 78.963032°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | రాచర్ల |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి భూపని వెంకటలక్ష్మమ్మ |
పిన్ కోడ్ | 523356 |
ఎస్.టి.డి కోడ్ | 08405 |
సత్యవోలు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 356., యస్.టీ.డీ.కోడ్ 08405.
గ్రామంలోని దేవాలయాలు[మార్చు]
- పట్టణానికి 8 కిలోమీటర్లదూరంలో రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో, పాండవుల మనుమడు జనమేజయుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అనంతరం చాళుక్య రాజులచే ఆలయనిర్మాణం జరిగింది. ఇక్కడ చాళుక్య శైలిలో నిర్మించబడిన భీమలింగేశ్వర, రామలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. వీటిని జాతీయ వారసత్వ సంపదగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
- శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:-
గ్రామ విశేషాలు[మార్చు]
ఉన్నది ఒకే వీధి, ఆవీధే ఒక గ్రామం. అయినా అలాంటి ఇలాంటిదేం కాదు. 33 గృహాలూ, 109 మంది జనాభా, 1600 యెకరాల పొలం, ప్రత్యేక తలారులతో రెవెన్యూ గ్రామంగా తులతూగుతోంది. ఒక్క సర్వే నంబరు 5 లోనే 500 యెకరాల పైగా భూమి ఉంది. ఈ వీధికే ప్రత్యేకంగా శ్మశానమూ ఉంది. ఇక్కడ అలంపురం తరహాలో నిర్మించిన స్థానిక రామలింగ, భీమలింగేశ్వరాలయాలు, ఉద్యానవనంలా ఉండే పరిసరాలతోపాటు అక్కడ ఒక వీధి ఉంటుంది. కాంక్రీటు రహదారి,పొందికగా నిర్మించిన రామాలయం, పోలేరమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ రెండు గ్రామాలూ ( సత్యవోలూ+భూపనగుంట్ల) కలిసే ఉన్నాయి. రెండు ఊర్లంటే ఒకే వీధి. [2]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి భూపని వెంకటలక్ష్మమ్మ, 48 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
బయటి లింకులు[మార్చు]
- అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఫోటోలైబ్రరీ[permanent dead link] లో సత్యవోలు ఆలయాల ఫోటోలు
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
- మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-26; 8వపేజీ [3] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-2; 1వపేజీ.