Coordinates: 15°27′50″N 78°57′47″E / 15.463773°N 78.963032°E / 15.463773; 78.963032

సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం
సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం
సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం
సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం is located in Andhra Pradesh
సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం
సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :15°27′50″N 78°57′47″E / 15.463773°N 78.963032°E / 15.463773; 78.963032
పేరు
ప్రధాన పేరు :రామలింగేశ్వర స్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:ప్రకాశం జిల్లా
ప్రదేశం:సత్యవోలు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:రామలింగేశ్వరుడు (శివుడు)
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:6
శిలాశాసనం:3
ఇతిహాసం
నిర్మాణ తేదీ:క్రీ.పూ 6వ శతాబ్దం
సృష్టికర్త:బాదామి చాళుక్యులు

సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం, [గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|[గిద్దలూరు]]పట్టణానికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న సత్యవోలు గ్రామంలో ఉన్న ఒక శివాలయం.[1][2] ఈ ఆలయాన్ని క్రీ. శ ఆరవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. భారత ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది.[1]

మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా సందర్శిస్తుంటారు.

చరిత్ర[మార్చు]

ఈ ఆలయంలో పాండవుల వారసుడైన జనమేజయుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వాసం. ఇక్కడ రామలింగేశ్వర ఆలయంతో పాటు భీమలింగేశ్వర ఆలయం కూడా ఉంది.

నిర్మాణం[మార్చు]

ఈ ఆలయ ప్రాంగణంలో ఆరు శివాలయాలున్నాయి. ఇందులో భీమేశ్వర ఆలయం అతి పెద్దది. దీని ముఖ ద్వారం తూర్పు వైపున ఉంది. మహా మండపానికి తూర్పు, దక్షిణ, పశ్చిమ ద్వారాల గుండా భక్తులు వచ్చి పోయే వీలుంది.

ఈ ఆలయంలో పెద్ద మండపం, గర్భగుడి, అంతరాళం ప్రధాన భాగాలు. ఆలయానికి దక్షిణంగా నాలుగు చేతులున్న దేవతా మూర్తి ఉంది. అంతరాళ శిఖరంపై రాతి కలశం ఉంది. మండపంలో ఉన్న నాలుగ స్తంభాలపై అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. దేవాలయ మధ్య భాగంలో నటరాజ విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో మహానంది ఆలయం నిర్మాణ శైలి కనిపిస్తుంది. మహానంది ఆలయాన్ని కూడా చాళుక్యులే నిర్మించారు.[3]

బాగా ఎత్తుగా నిర్మించబడిన ఈ ఆలయ గర్భగుడి మధ్యలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది. గర్భగుడి గోడలపై ఉన్న గూళ్ళలో ఈశ్వరుని విగ్రహం, లింగోద్భవ మూర్తి, దుర్గా దేవి ప్రతిమలు ఉన్నాయి.

ఈ ఆలయాన్ని సందర్శించడానికి చుట్టు పక్కల ప్రాంతాల వారే కాక దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 విలేకరి. "సూర్య ఆదివారం: సత్యవోలు రామలింగేశ్వరస్వామి". suryaa.com. సూర్య దినపత్రిక. Retrieved 16 October 2016.[permanent dead link]
  2. "రామలింగేశ్వర స్వామి ఆలయం". manatemples.net. manatemples. Archived from the original on 27 నవంబరు 2019. Retrieved 16 October 2016.
  3. "సత్యవోలు రామలింగేశ్వర స్వామి ఆలయం". teluguone.com. Telugu One. Retrieved 16 October 2016.