Jump to content

సత్యేంద్రనాథ్ ఠాగూర్

వికీపీడియా నుండి
సత్యేంద్రనాథ్ ఠాగూర్
সত্যেন্দ্রনাথ ঠাকুর
Satyendranath Tagore
జననం1 June 1842
మరణం9 January,1923 (aged 80)
జాతీయతIndian
వృత్తిcivil servant, poet, composer, writer, social reformer & linguist
Brahmo Samaj
సుపరిచితుడు/
సుపరిచితురాలు
First Indian to be an ICS officer (present-day equivalent to IAS officer) , Indian feminist movement
జీవిత భాగస్వామిJnanadanandini Devi.

సత్యేంద్రనాథ్ ఠాకూర్ (Satyendranath Tagore) (1 జూన్ 1842 - 9 జనవరి 1923) ఇండియన్ సివిల్ సర్వీస్‌లో మొట్టమొదలు నియమితుడైన (రిక్రూట్) మొదటి భారతీయుడు . అతడు రచయిత, సంగీతకారుడు, భాషావేత్త, సంఘ సంస్కర్త. అతడు రవీంద్రనాథ్ ఠాగూర్ రెండవ పెద్ద సోదరుడు. లండన్ లో పోటీ పరీక్షల ద్వారా ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసిఎస్)లో ప్రవేశించిన మొదటి భారతీయుడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడు.[1]

జీవితం

[మార్చు]

సత్యేంద్రనాథ్ ఠాకూర్ మహర్షి దేబేంద్రనాథ్ ఠాగూర్, శారదా దేవి దంపతులకు 1842 జూన్ 1 న కోల్ కతాలోని జోరసంకోకు చెందిన ఠాగూర్ కుటుంబంలో జన్మించాడు. ఇతని భార్య జ్ఞానదానందినీ దేవి. అతడు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై , కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీకి ఎంపికై , కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షకు హాజరైన మొదటి బ్యాచ్‌ విద్యార్థి. ఠాగూర్ ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసిఎస్) మొదటి భారతీయ అధికారి.ఠాగూర్ 1864 లో సేవలో చేరాడు. అతను మొదట బాంబే ప్రెసిడెన్సీలో నియమించబడ్డాడు, తరువాత అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్/మేజిస్ట్రేట్‌గా నియమించబడ్డాడు. అతడు 30 సంవత్సరాలు తన సేవలను అందిస్తూ , 1896లో మహారాష్ట్రలోని సతారాలో న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. [2] లార్డ్ మెకాలే ఇచ్చిన నివేదికను పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం 1854 లో భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షను నిర్వహించడం ప్రారంభించారు. గతంలో, ప్రభుత్వోద్యోగులను ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు నియమించేవారు, వీరు లండన్ లోని హేలీబరీ కళాశాలలో శిక్షణ పొందిన తరువాత భారతదేశానికి వచ్చి ఉద్యోగాలలో చేరేవారు . 1854లో సివిల్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తరువాత, 1855లో లండన్ లో పోటీ పరీక్షలను ప్రవేశపెట్టారు. సివిల్ సర్వీస్ పరీక్షకు కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు నిర్ణయం చేసారు. ఈ పరీక్షలు భారతీయులకు చాలా సవాలుగా ఉండేవి.[3]

భాషా జ్ఞానం

[మార్చు]

సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్ల, బెంగాలీ, సంస్కృతం భాషలపై మంచి పరిజ్ఞానం ఉండేది. అతడు బ్రహ్మ సమాజ్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు, 1900-01 లో బంగియా సాహిత్య పరిషత్తు అధ్యక్షుడిగా ఉన్నాడు. బాలగంగాధర తిలక్ రచించిన గీతారహస్యాన్ని బెంగాలీ భాషలోనికి అనువాదంతో పాటు, సుశీలా ఓ బిర్సింగా, బొంబాయి చిత్ర, భరట్వర్సియా ఇంగ్రేజ్, అమర్ బాల్యకథ ఓ బాంబే ప్రబాస్ వంటి అనేక సాహిత్య రచనలు చేశాడు. ఠాగూర్ సమాజంలో మహిళల అభ్యున్నతి కోసం ఆయన చేసిన అవిశ్రాంత కృషి చేశాడు. మహిళల జీవనశైలికి మద్దతు ఇచ్చాడు, సమాజం నుండి పర్దా వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేశాడు. అతను తన స్వంత కుటుంబం నుండి ఈ మార్పును ప్రారంభించాడు,[4] ఈ ప్రక్రియలో అందరికీ మార్గదర్శిగా, ప్రేరణగా నిలిచాడు.[5]

మరణం

[మార్చు]

సత్యేంద్రనాథ్ ఠాగూర్ 1923 సంవత్సరంలో సంవత్సరంలో కలకత్తా లో మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Satyendranath Tagore | Making Britain". www.open.ac.uk. Retrieved 2022-04-29.
  2. "Satyendranath Tagore: The First Indian Civil Servant" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-29.
  3. "Meet Satyendranath Tagore, the first Indian to become an IAS officer 157 years ago". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-29.
  4. "Satyendranath Tagore (1842–1923); brother of Rabindranath". The Scottish Centre of Tagore Studies (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-02-05. Retrieved 2022-04-29.
  5. "Who is the First IAS Officer in India? Know Biography of Satyendranath Tagore". UPSC Pathshala (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-02. Retrieved 2022-04-29.
  6. "The First Indian to Join the I.C.S. (Satyendranath Tagore Biography) - Free Online India" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-30. Retrieved 2022-04-29.