దేవేంద్రనాథ్ ఠాగూర్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
దేవేంద్రనాధ్ టాగోర్ দেবেন্দ্রনাথ ঠাকুর | |
---|---|
జననం | కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా[1] | 1817 మే 15
మరణం | 1905 జనవరి 19 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | (వయసు 87)
జాతీయత | Indian |
వృత్తి | మత సంస్కర్త |
ఉద్యమం | బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం |
జీవిత భాగస్వామి | సరళా దేవి |
పిల్లలు | ద్విజేంద్రనాథ్ టాగూర్, సత్యేంద్రనాథ్ టాగూర్, హేమేంద్రనాథ్ టాగూర్, జ్యోతిరీంద్రనాథ్ టాగూర్, రవీంద్రనాథ్ టాగూర్, వీరేంద్రనాథ్ టాగూర్, సోమేంద్రనాథ్ టాగూర్, సౌదామిని టాగూర్, సుకుమారి టాగూర్, శరత్ కుమారి టాగూర్, స్వర్ణకుమారి టాగూర్, వర్ణకుమారి టాగూర్. |
దేవేంద్రనాధ్ టాగోర్ (Bengali: দেবেন্দ্রনাথ ঠাকুর) ( మే 15 1817 – జనవరి 19 1905) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మతంలో సంస్కరణలు తేవడానికి ప్రయత్నించాడు. ఈయన 1848 లో బ్రహ్మో మతం స్థాపించాడు.
కుటుంబ స్థితిగతులు
[మార్చు]దేవేంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ లో జొరా సంకోలో జన్మించారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ టాగూర్. దేవేంద్రనాథ్ వంశస్థులు తరతరాలుగా స్థితిమంతులే కాక ఉన్నత విద్యావంతులు, వారి రంగాల్లో నిపుణులూ కూడా అయి ఉన్నారు. ఆ క్రమంలోనే దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్‌ను ప్రిన్స్ బిరుదుతో వ్యవహరించేవారు. ద్వారకానాథ్ ఠాగూర్ ఆనాటి వంగదేశంలో సంస్కర్తగా, మతకర్తగా ప్రఖ్యాతుడైన రాజా రామమోహనరాయ్ సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన సంస్కరణాభిలాషను, హిందూమత ఔన్నత్య చింతననూ ద్వారకానాథ్ అభినందించేవారు. రామమోహనరాయ్ ప్రారంభించిన బ్రహ్మ సమాజంపై సమాజంలోని నలువైపులా ఆరోపణలు, వ్యతిరేకత ప్రారంభమైన రోజుల్లో ద్వారకానాథ్ బ్రహ్మసమాజానికి, రామ్మోహనరాయ్‌కీ ప్రధాన సహాయకునిగా ఉండేవారు. ఠాగూరు కుటుంబపు జాగీరైన జాకో సంకోలోని ఒక భవనంలో బ్రహ్మసమాజపు మొదటి ప్రార్థనాలయాన్ని నిర్మించారు. దానికి ఆది బ్రహ్మసమాజం అని పేరుపెట్టారు రామ్మోహనరాయ్. ఆపైన జొరా సంకోలో ఠాగూరు వంశస్థులందరూ బ్రహ్మసమాజీకులుగా మారారు. రామ్మోహనరాయ్ క్రైస్తవ మతప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మిషనరీ పాఠశాలలకు ప్రతిగా ప్రారంభించిన విద్యాలయాల్లో కూడా ఠాగూర్ వంశస్థులే తొలి విద్యార్థులుగా చేరారు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]- సరళా దేవి చౌధురాని :ఈమె దేవేంద్రనాధ్ టాగోర్ మనమరాలు. కుమార్తె స్వర్ణకుమారి దేవి కుమార్తె.
- రవీంద్రనాధ టాగూరు : దేవేంద్రనాధ్ ఠాగోర్ కుమారుడు
- దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రము : రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రచించిన దేవేంద్రనాథ్ ఠాగూర్ జీవితచరిత్రకు సంబంధించిన అనువాద గ్రంథం.
- సత్యేంద్రనాథ్ ఠాకూర్: దేవేంద్రనాధ్ ఠాగోర్ కుమారుడు( మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వీసులో చేరిన భారతీయుడు)
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Chaudhuri, Narayan (2010). Maharshi Debendranath Tagore. Makers of Indian Literature (2nd ed.). New Delhi: Sahitya Akademi. p. 11. ISBN 978-81-260-3010-1.
- ↑ దేవేంద్రనాథ్ ఠాకూరు చరిత్రము:మూ.దేవేంద్రనాథ్ భట్టాచార్య, ఆ.ఆకురాతి చలమయ్య:శాంతికుటీరం ప్రచురణ:1937
- విస్తరించవలసిన వ్యాసాలు
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- Infobox person using religion
- Articles containing Bengali-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- బెంగాల్ చరిత్ర
- బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం
- 1817 జననాలు
- 1905 మరణాలు
- ప్రపంచ ప్రసిద్ధులు