దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రము
Jump to navigation
Jump to search
దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రం రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రచించిన దేవేంద్రనాథ్ ఠాగూర్ జీవితచరిత్రకు సంబంధించిన అనువాద గ్రంథం.
దేవేంద్రనాథ్ ఠాగూర్ (మే 15 1817 – జనవరి 19 1905) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఇతను హిందూ ధర్మ సంస్కరణకు కృషిచేశారు. 1848 లో బ్రహ్మో మతం స్థాపించిన వ్యక్తి.ఇతను బెంగాల్ నందు శ్రీలైదాహలో జన్మించాడు. ఈ గ్రంథంలో చలమయ్య అతని జీవిత చరిత్రను వివరించాడు.[1] దీనికి దేవేంద్రనాథ భట్టాచార్య బెంగాలీ భాషలో రచన మూలం. దీని ప్రథమ ముద్రణ 1934లో విడుదలవగా, ద్వితీయ ముద్రణ 1936లోను, తృతీయ ముద్రణ 1937లో విడులైనవి. వీటిని శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల ముద్రించగా; శాంతి కుటీరం, పిఠాపురం వారు ప్రచురించారు. రచయిత ఈ గ్రంథాన్ని రఘుపతి వేంకటరత్నం నాయుడుకు సమర్పించాడు.
విషయసూచిక
[మార్చు]- ప్రథమ ప్రకరణం - పరిచయం
- ద్వితీయ ప్రకరణం - స్థితిగతులు
- తృతీయ ప్రకరణం - జన్మం
- చతుర్థ ప్రకరణం - దేవేంద్రనాథుడు, శైశవము
- పంచమ ప్రకరణం - స్వభావం
- షష్ఠ ప్రకరణం - తత్త్వబోధినీసభ
- సప్తమ ప్రకరణం - సంసారం
- అష్టమ ప్రకరణం - కర్మక్షేత్రం
- నవమ ప్రకరణం - సాధన
- దశమ ప్రకరణం - మహర్షి
- ఏకాదశ ప్రకరణం- శాంతినికేతనం