సబ్బని లక్ష్మీ నారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సబ్బని లక్ష్మీ నారాయణ
స్థానిక పేరుసబ్బని లక్ష్మీ నారాయణ
జననం(1960-04-01)1960 ఏప్రిల్ 1
నివాస ప్రాంతం
6-6-302, సాయి నగర్, కరీంనగర్
మండలం:కరీంనగర్
జిల్లా:కరీంనగర్
తెలంగాణ రాష్ట్రం
 India ఇండియా
విద్యవిద్య: ఎం. ఎ. ( ఆంగ్లం), ఎం. ఎ. ( హింది), ఎం. ఎ. ( ఆస్ట్రాలజీ), ఎం.ఎస్సీ. ( సైకాలజీ), ఏం.ఎడ్. , పి.జి. డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్.
భార్య / భర్తశారదా
పిల్లలుశరత్ చంద్ర, వంశీ కృష్ణ
తల్లిదండ్రులునాగమ్మ, మల్లేశం

సబ్బని లక్ష్మీ నారాయణ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన కవి, రచయిత.

జననం[మార్చు]

సబ్బని లక్ష్మీ నారాయణ, కవి, రచయిత, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ మండలం, కరీంనగర్ జిల్లా, బొమ్మకల్ గ్రామంలో 1960 ఏప్రిల్ 01 నాడు జన్మించాడు.[1][2]

కుటుంబ నేపథ్యం[మార్చు]

తల్లిదండ్రులు నాగమ్మ- మల్లేశం (చేనేత కు టుంబం) భార్య శ్రీమతి సబ్బని శారద గృహిణి. కుమారులు ఇద్దరు. పెద్ద కుమారుడు శరత్ చంద్ర అమెరికాలో నివాసం సాప్ట్ వేర్ ఇంజనీర్, కోడలు సృజన గృహిణి. మనుమలు : శ్రీయాన్, కృతిన్. చిన్న కుమారుడు : వంశీ కృష్ణ.

సాహితీ ప్రస్థానం[మార్చు]

1979 - 1980 ల్లోంచి విద్యార్థి దశనుంచే రచనలు చేస్తున్నాడు. వచన కవిత, దీర్ఘ కవిత, కథలు, నవలలు, వ్యాసాలు, సమీక్షలు, విమర్శలు, పేరడీ రచన, మినీ కవితలు, నానీలు, నానోలు, రెక్కలు, హైకూలు, ఏక వాక్య కవితలు, పాటలు, అనువాదాలు, యాత్ర చరిత్ర, పద్యం మొదలగు ప్రక్రియల్లో రచనలు చేశాడు. తెలుగు, హింది, ఇంగ్లీష్ భాషలలో రచనలు చేయగలడు.[3] [4]

పుస్తకాలు[మార్చు]

1.మౌనసముద్రం ( వచన కవిత) - 1999.

2. మన ప్రస్థానం ( పేరడీలు ) -2001.

3. బతుకు పదాలు- 2003 .

4. నది నా పుట్టుక ( వచన కవిత) - 2005.

5. మనిషి ( దీర్ఘ కవిత ) -2007.

6.శేషేంద్ర స్మృతిలో -2007.

7.అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి ( కథలు).

8. చెట్టునీడ ( వచన కవిత) - 2010.

9. అవ్వ ( స్మృతి కవిత ) - 2010.

10. తెలంగాణ ఒక సత్యం ( వచన కవిత) - 2010.

11. హైదరాబాద్! ఓ! హైదరాబాద్! (దీర్ఘ కవిత).

12. తెలంగాణ నానోలు -2010.

13. తెలంగాణ రెక్కలు- -2010.

14. చారిత్రక తెలంగాణ (గేయ కవిత) -2010.

15. తెలంగాణ హైకూలు- 2011.

16. తెలంగాణ నానీలు -2011.

17. తెలంగాణ వైభవ గీతములు- 2015.

18.తెలంగాణ మార్చి - 2015.

19. తెలంగాణ - కొన్ని వాస్తవాలు ( వ్యాసాలు).

20. దంపతి నానీలు (సబ్బని శారదతో కలిసి).

21. ప్రేమంటే (వచన కవిత) - 2016.

22. సాహిత్య నానోలు - 2016 .

23 షహీద్ భగత్‌ సింగ్ ( జీవిత చరిత్ర) - 2016 .

24. చాణక్యుని నీతి సూత్రములు ( అనువాదము) .

25. భక్త మీరా కవితలు ( అనువాదం) - 2017.

26. అక్షరాణువులు (నానోలు) - 2017.

27. ప్రేమ స్వరాలు ( ఏకవాక్య కవితలు) -2017.

28. అనుభవ సత్యాలు- ఆణిముత్యాలు - 2017.

29. అక్షర సౌరభాలు ( ఏకవాక్య కవితలు) - 2017 .

30. వండర్ ల్యాండ్ అమెరికా నానీలు -2017.

31. తెలంగాణ పదాలు -2018.

32. సబ్బని కవి పల్కు సత్యమెపుడు (పద్యములు).

33. ఆటవెలదిలో అమెరికా -2018.

34. నా అమెరికా సాహితీ సౌహార్ధ యాత్ర -2018.

35. సబ్బని సాహిత్య వ్యాసములు - 2023.

36. అతని ప్రేమ కోసం ( నవల ).

కవితా సంకలనాల సంపాదకులు[మార్చు]

1.నేటి కవిత -2007 .

2.నేటి కవిత -2008 .

3.నేటి కవిత-2004.

4.స్వతంత్ర భారత అమృత మహోత్సవములు.

(భారత్ కీ ఆజాది కా అమృత మహోత్సవం) సంపాదకుడు తెలుగు, హిందీ, ఆంగ్లంలోని త్రిభాషా కవితా సంకలనం.

సాహిత్య సాంస్కృతిక సంస్థలు కార్యకలాపాలు[మార్చు]

  • శరత్ సాహితీ కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు, కరీంనగర్ (1999).
  • తెలంగాణ సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, కరీంనగర్ (2001).

ఆడియో ఆల్బమ్స్[మార్చు]

1) తెలంగాణ వైభవం -2014.

2) తెలంగాణ వైభవ గీతములు - 2015.

3) తెలుగు, హిందీ, ఆంగ్లంలో స్వచ్ఛ భారత్ పాటలు -2015.

4) పర్యావరణంపై పాటలు -2015.

5) తెలంగాణ చెరువుల గీతములు - 2015.

6) గోదావరి నది పాట-2015.

7) స్వాతంత్ర్య సమరయోధుడు తోటపల్లి గాంధీ స్మారక గీతం -2014.

8) స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక గీతం -2014.

అవార్డులు[మార్చు]

1. తెలుగు విశ్వ విద్యాలయ కీర్తి పురస్కారం 2018.

2. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ఆం.ప్ర. ప్రభుత్హ్వం. -201౩.

3.సాహిత్య భూషణ్ అవార్డ్, సారస్వత జ్యోతి మిత్ర మండలి, కరీంనగర్.- 20౦5.

4. బెస్ట్ ఎన్ ఎన్ యస్. ప్రోగ్రాం కోర్డినేటర్ అవార్డు కరీంనగర్ జిల్లా. -2011.

5.మహా కవి శేషేంద్ర అవార్డ్ - 2015, హైదరాబాద్.

6. ఉమ్మడి శెట్టి సాహిత్య ప్రతిభా పురస్కారము -2015, అనంతపురము. ఆం.ప్ర.

7.మళ్ళా జగన్నాధం స్మారక ఉత్తమ కవి పురస్కారము- 2015, అనకాపల్లి . ఆం.ప్ర.

8. సాహిత్య రత్న అవార్డ్ 2016, కాఫ్లా అంతర్జాతీయ సంస్థ, చండీఘడ్.

9.అద్దేపల్లి స్మారక కవితా పురస్కారము-2016, విజయవాడ. ఆం.ప్ర.

10. నానోల పురస్కారము -2016, ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం, ఆం.ప్ర.

11.బి.ఎస్. రాములు, సాహితీ స్వర్ణోత్సవ దీర్ఘ కవితా పురస్కారము-2018, హైదరాబాద్.

12. BEST POET OF THE YEAR 2003 AWARD, POETS INTERNATIONAL బెంగుళూరు.

13.కలహంస సాహితీ పురస్కారం 2014. నెలవంక నెమలీక మాసపత్రిక, హైదరాబాద్.

14. " నవ సృజన్ కళా ప్రవీణ్ అవార్డు " కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్ -2021.

15. డి.లిట్ : సాహిత్యంలో గౌరవ డాక్టరేట్. సెయింట్ మదర్ తెరెసా వర్చువల్ యూనివర్శిటీ నుండి . 2019లో బెంగళూరు.

ఇతర వివరములు[మార్చు]

1.శరత్ సాహితీ కళా స్రవంతి, కరీంనగర్, అధ్యక్షులు.

2. తెలంగాణ సాహిత్య వేదిక, కరీంనగర్, అధ్యక్షులు.

3. సాయినగర్, వెల్ఫేర్ సొసైటి, కరీంనగర్ వ్యవస్థాపక అధ్యక్షులు.

మూలాలు[మార్చు]

  1. "ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా రూపాలు – మయూఖ" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-02-28. Retrieved 2024-04-01.
  2. Ltd, Nasadiya Tech Pvt. "Bathuku padalu - An online Telugu story written by Sabbani lakshmi narayana | Pratilipi.com". telugu.pratilipi.com. Retrieved 2024-04-01.
  3. "NAANEELU: నానీలు - పుస్తకావిష్కరణలు". NAANEELU. Retrieved 2024-04-01.
  4. "SABBANI LAXMI NARAYANA GST Number - 36APFPS3439H2ZM - Masters India". web.archive.org. 2023-08-15. Archived from the original on 2023-08-15. Retrieved 2024-04-01.