సమీర్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమీర్ శర్మ 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయనకు పబ్లిక్, కార్పొరేట్ సంస్థల నిర్వహణలో మంచి అనుభవం ఉంది.[1] ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కో, ఐటీడీసీ సిఎండిగా పనిచేశాడు. 2021 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఈయనకు ముందు ఈ పదవిలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన కమ్యూనిటీ ప్లానింగ్ లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినప్పుడు అత్యుత్తమ విద్యార్థిగా గుర్తింపబడ్డాడు. అమెరికాలో ఇదే అంశంపై పి.హెచ్.డీ కూడా చేసాడు. కంచి లో శంకరాచార్య విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ పట్టా కూడా అందుకున్నాడు.[2]

వృత్తి

[మార్చు]

సమీర్ శర్మ 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయనకు 37 ఏళ్ళకు పైగా పబ్లిక్, ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు మునిసిపల్ కమీషనర్ గా పనిచేశాడు. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా పరిపుష్టి చేయడంలో కీలకపాత్ర వహించాడు.

కేంద్రప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, ప్రపంచ బ్యాంకు నిధులతో పట్టణాభివృద్ధి మొదలైన కార్యక్రమాలకు డైరెక్టరుగా వ్యవహరించాడు.

ఈయన Smart Cities Unbundled, A Textbook on urban planning Geography అనే రెండు పుస్తకాలు కూడా రాశాడు.

మూలాలు

[మార్చు]
  1. "AP: జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ". Zee News Telugu. 2021-09-10. Retrieved 2022-03-07.
  2. "బయో" (PDF). IICA. Retrieved 7 March 2022.{{cite web}}: CS1 maint: url-status (link)