సయ్యద్ మొయినుద్దీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయ్యద్ మొయినుద్దీన్
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ 1924
జనన ప్రదేశం హైదరాబాదు, తెలంగాణ
మరణ తేదీ 1 అక్టోబరు 1978
మరణ ప్రదేశం హైదరాబాదు, తెలంగాణ
జాతీయ జట్టు
భారతదేశం
† Appearances (Goals).

సయ్యద్ క్వాజా మొయినుద్దీన్ (1924 – 1978 అక్టోబరు 1) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.[1] 1952లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల టోర్నమెంట్‌ విభాగంలో పాల్గొన్నాడు.[2]

జననం[మార్చు]

సయ్యద్ మొయినుద్దీన్ 1924లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.[3]

ఉద్యోగం[మార్చు]

36 సంవత్సరాలపాటు పోలీసు శాఖలో పనిచేసి, 1977లో ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ పొందాడు.

క్రీడారంగం[మార్చు]

సయ్యద్ అబ్దుల్ రహీమ్ దగ్గర శిక్షణ పొందిన సయ్యద్ మొయినుద్దీన్ హైదరాబాద్ ఎలెవన్ హంటర్స్, స్టూడెంట్ అథ్లెటిక్ క్లబ్, హైదరాబాద్ పోలీసు జట్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 1963 వరకు వివిధ జట్టులలో ఆటగాడిగా కొనసాగాడు. స్పాన్సర్ లేకపోవడం వల్ల 1948 ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయిన మొయినుద్దీన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌లో సైలెన్ మన్నా, [4] 1954లో జరిగిన ఆసియా గేమ్స్‌లో ఆడాడు. 1954లో స్వీడన్, 1955లో రష్యాపై స్వదేశంలో జరిగిన మ్యాచ్ లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు.[5]

కుటుంబం[మార్చు]

సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ కుమారుడు సయ్యద్ లతీఫుద్దీన్ ఫుట్‌బాల్ ఆటలో భారతదేశపు టాప్ లెఫ్ట్ వింగర్‌గా ప్రశంసించబడ్డాడు. లతీఫ్ 1973-1977 వరకు నాలుగు సంవత్సరాలపాటు భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కలకత్తాలోని సంస్థ నుండి షాన్ -ఇ -మహమ్మదన్ ' పేరిట లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.[6]

మరణం[మార్చు]

సయ్యద్ మొయినుద్దీన్ తన 56 ఏళ్ళ వయసులో 1978, అక్టోబరు 1న గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "Sayed Moinuddin". Olympedia. Retrieved 21 October 2021.
  2. "Sayed Moinuddin Bio, Stats, and Results | Olympics at Sports-Reference.com". web.archive.org. 2020-04-18. Archived from the original on 2012-12-18. Retrieved 2021-10-21.
  3. "Syed Khaja Moinuddin". www.thehinduimages.com. Archived from the original on 2021-10-21. Retrieved 2021-10-21.
  4. "Olympedia – Syed Moinuddin". www.olympedia.org. Retrieved 2021-10-21.
  5. Moinudden RIP, Sportsweek, October 15, 1978
  6. The Times of India, Telangana (22 June 2017). "Hyderabad footballer Syed Lateefuddin is 'Shan-e-Mohammedan' | Hyderabad News - Times of India" (in ఇంగ్లీష్). B. Krishna Prasad. Archived from the original on 29 June 2017. Retrieved 21 October 2021.
  7. Indian and Foreign Review. Vol. 16. 1978.