సహాయం:విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చెయ్యడం పరిచయం/3
ఎడిటరును తెరవడం
పరికరాలపట్టీ ప్రాథమిక విషయాలు
లింకులు, వికీలింకులు
మార్పులను ప్రచురించడం
కొత్త వ్యాసాల సృష్టి
సారాంశం
|
సాధారణంగా, వికీలింకును పేజీలో పదం ఇస్తాం. లింకును మెనూ ద్వారా ఇవ్వవచ్చు. లేదా కీబోర్డు షార్ట్కట్ Ctrl+Kద్వారా ఇవ్వవచ్చు.
లింకు మెనూ లేదా షార్ట్కట్ ద్వారా లింకు ఇచ్చేటపుడు ఒక డయలాగ్ పెట్టె కనిపిస్తుంది. అందులో వికీపీడియాలో సంబంధిత పేజీల కోసం వెతకవచ్చు. ↵ Enterనొక్కి, లేదా "పూర్తయ్యింది"బొత్తాన్ని నొక్కి విజువల్ ఎడితరు పేజీలో ఆ పేజీ లింకును చేర్చవచ్చు.
"బయటి సైటు" ట్యాబును వాడి, అక్కడి పెట్టెలో URL ఇచ్చి, బయటి లింకులు (ఇతర వెబ్సైట్లకు) ఇవ్వవచ్చు. వ్యాసాల పేజీల్లో, పేజీకి అడుగున ఉండే బయటి లింకులు అనే విభాగంలో మాత్రమే ఇవ్వడం సముచితం. (పాఠ్యానికి మద్దతుగా ఇచ్చే మూలంలో URL ఎలా ఇవ్వాలో తెసుకునేందుకు మూలాల పాఠం చూడండి)
|