సహాయం:సభ్యుని రచనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫలానా సభ్యుడు/సభ్యురాలు చేసిన దిద్దుబాట్లు సభ్యుని రచనలు పేజీలో చూడవచ్చు. ఏ ప్రాజెక్టుకు చెందిన సభ్యుని రచనలు పేజీ ఆ ప్రాజెక్టులోనే ఉంటుంది. అంచేత వికీపీడియాలో సదరు సభ్యుని రచనలు పేజీలో విక్షనరీలో ఆ సభ్యుడు/సభ్యురాలు చేసిన దిద్దుబాట్లు కనిపించవు.

గతంలో మీరు చేసిన మార్పులను చూసి ఓ సారి జ్ఞాపకం చ్వేసుకునేందుకు సభ్యుని రచనలు ఉపయోగపడతాయి. మీరు దిద్దుబాటు చేసాక, ఇతరులెవరైనా దిద్దుబాట్లు చేసారా, అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్లను కూడా చూడవచ్చు. కాపీహక్కుల ఉల్లంఘనలు మొదలైన వాటిని గమనించేందుకు కూడా దీన్ని వాడుకోవచ్చు.

సభ్యుని రచనలు పేజీకి ఎలా వెళ్ళాలి

[మార్చు]

మీ స్వంత సభ్యుని రచనలు పేజీకి వెళ్ళడం

[మార్చు]
  • మీరు చేసిన రచనలను చూసేందుకు పేజీలో పై భాగాన ఉన్న నా మార్పులు-చేర్పులు లింకు నొక్కండి.

ఇతరుల సభ్యుని రచనలు పేజీకి వెళ్ళడం

[మార్చు]
  • వాడుకదారుకు ఖాతా ఉంటే (సభ్యనామం): సభ్యుని పేజీకి వెళ్ళండి. ఎడమ వైపున ఉన్న సభ్యుని రచనలు లింకు నొక్కండి. సభ్యుడు/సభ్యురాలు సభ్యుని పేజీలో ఏమీ రాయకున్నా ఈ లింకు పనిచేస్తుంది.
  • సభ్యనామం లేకపోతే, రెండు పద్ధతులున్నాయి:

సభ్యుని రచనలు పేజీని ఉపయోగించడం

[మార్చు]

డిఫాల్టు తొడుగుతో ఓ సభ్యుని రచనలు పేజీ నమూనా ఇది:
సభ్యుని రచనలు పేజీ నమూనా
దిద్దుబాట్లిఉ అన్నిటికంటే కొత్తవాటి నుండి అన్నిటికంటే పాతవాటి వరకు చూపించబడి ఉంటాయి. ఒక్కో దిద్దుబాటు ఒక్కో పేజీలో ఉంటుంది; సమయం & తేదీ, పేజీ పేరు, దిద్దుబాటు సారాంశం మొదలైన వాటితో సహా మరింత సమాచారం. ఈ పేజీలో ఉండే సమాచారం గురించి:

  1. సభ్యుని పేరు లేదా ఐపీఅడ్రసు ఇక్కడ ఉంటుంది.
  2. ఫలితాలను వడకట్టేందుకు నేమ్ ప్సేసు ను ఎంచుకుని చూడవచ్చు. ఉదాహరణకు, మూస నేమ్ స్పేసు లోని దిద్దుబాట్లు మాత్రమే చూడదలిస్తే, దాన్ని ఎంచుకుని వెతుకు నొక్కడమే.
  3. దిద్దుబాటు చేసిన సమయం, తేదీ.
  4. (చరితం) లింకు పేజీ చరితంకు తీసుకుపోతుంది. మీరు పనిచేసిన పేజీలో ఇతరులు చేసిన దిద్దుబాట్లను చూసేందుకు ఈ లింకు పనికొస్తుంది.
  5. (తేడాలు) ఈ దిద్దుబాటు నాటి కూర్పుకు, ప్రస్తుత కూర్పుకు మధ్య గల తేడాను చూపిస్తుంది.
  6. చి చిన్న మార్పులను సూచిస్తుంది.
  7. దిద్దుబాటు జరిపిన పేజీ పేరు. ఈ దిద్దుబాటు తరువాత పేజీ పేరు మారి ఉంటే, పాత పేరే కనిపిస్తుంది.
  8. ఇది దిద్దుబాటు సారాంశం. తన దిద్దుబాటును భద్రపరచే ముందు సారాంశం పెట్టెలో సభ్యుడు/సభ్యురాలు రాసిన సారాంశం.
  9. (top) అంటే ఈ దిద్దుబాటే ఈ పేజీకి చిట్టచివరిది అని అర్థం. అని లేకపోతే మీ దిద్దుబాటు తరువాత ఆ పేజీలో ఇతరులు దిద్దుబాట్లు చేసారన్న మాట. నిర్వాహకులకు మాత్రమే కనబడే rollback లింకు ఈ దిద్దుబాటు పక్కనే కనబడుతుంది.
  10. ఈ దిద్దుబాటు సారాంశం మొదట్లో బాణం గుర్తు ఉంది. దీని అర్థం, సభ్యుడు/సభ్యురాలు పేజీలోని ఒక విభాగాన్ని దిద్దుబాటు జరిపారన్న మాట.ఆ విభాగం పేరు బాణం గుర్తు పక్కనే ఉన్న బూడిద రంగు టెక్స్టు.
  11. అన్నిటి కంటే కొత్త రచనలకు, లేదా అన్నిటికంటే పాత రచనలకు వెళ్ళేందుకు లింకులు. సభ్యుని రచనలు తక్కువగా ఉంటే, ఈ పేర్లు లింకులు లేకుండా కనబడతాయి.
  12. పేజీకి ఎన్ని రచనలు చూపించాలి అనేది ఈ అంకెలను - 20, 50, 100, 250, 500 - నొక్కడం ద్వారా ఎంచుకోవచ్చు.

ఇంకా చూపినవి

[మార్చు]
  • కొత్త పేజీ సృష్టి

చూపించనివి

[మార్చు]
  • తొలగించిన పేజీలోని దిద్దుబాట్లు (ఆ పేజీని పునస్థాపిస్తే తప్ప)
  • అప్పటికే ఉన్న ఓ బొమ్మ పేరుతో మరో బొమ్మను అప్ లోడు చేసి, మొదటి దాని స్థానంలో చేర్చడం
  • పేజీ తొలగింపు, పునస్థాపన (సభ్యుడు/సభ్యురాలు నిర్వాహకులైన పక్షంలో)

URLలు, లింకులు

[మార్చు]

సభ్యుని రచనలు లింకు ఇలా ఉంటుంది: //te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Contributions&target=XX లేదా //te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Contributions/XX

ఇందులో XX అంటే సభ్యనామం లేదా ఐపీఅడ్రసు.

సభ్యుని రచనలు పేజీకి లింకు ఇలా ఇవ్వాలి: ప్రత్యేక:Contributions/XX.

అంతర్వికీ లింకులు మామూలుగానే పనిచేస్తాయి: w:Special:Contributions/XX.

ఒక ప్రత్యేక నేమ్ స్పేసు లోని రచనలను మాత్రమ్ ఏచూసేందుకు URL లో సదరు నేమ్ స్పేసు యొక్క సంఖ్యను ఇవ్వాలి: //te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Contributions&target=XX&namespace=4

గోప్యత

[మార్చు]

మీ రచనలను ఎవరైనా చూడవచ్చు - మరువకండి.