సాంప్రదాయిక విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
దేశము | India |
---|---|
తరహా | డిజిటల్ లైబ్రరీ |
ఆశయం | సాంప్రదాయ జ్ఞానం |
స్థాపితము | 2001 |
ప్రదేశము | విజ్ఞాన్ సుచ్నా భవన్ 14, సత్సంగ్ విహార్ మార్గ్, న్యూఢిల్లీ-110067, భారతదేశం |
వెబ్‌సైటు | www.tkdl.res.in |
సాంప్రదాయిక విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయం (ఇంగ్లీషు - Traditional Knowledge Digital Library) అనేది భారతీయ సాంప్రదాయిక విజ్ఞానాన్ని మరీ ముఖ్యంగా భారతీయ వైద్య విధానాల్లోని ఔషధ ముక్కలు, సూత్రీకరణలుని భద్రపరచే భారతీయ విజ్ఞాన డిజిటల్ భాండాగారము. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు, ఆయుర్వేద, యోగ, ప్రాకృతిక చికిత్సా, యూనానీ, సిద్ధ, హోమియోపతి విభాగం (ఆయుష్-AYUSH), కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా 2001వ సంవత్సరంలో స్థాపించాయి. దీని ప్రధాన ఉద్దేశం భారతదేశపు ప్రాచీన, సాంప్రదాయిక విజ్ఞానాన్ని మేధోచౌర్యం నుండి సంరక్షించడం.
2010 నాటికి ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ భాషలలోకి ఆయుర్వేదం, యోగ, ప్రాకృతిక చికిత్స, యూనానీ, సిద్ధ, హోమియోపతి వైద్యవిధానాలకు సంబంధించిన 148 పుస్తకాలు (సుమారు 34 మిలియన్ పేజీలు) అనువదించి అందరికీ అందుబాటులో ఉంచింది. ఆయుర్వేదానికి సంబంధించినవి 80000, యూనానీకి చెందినవి 1000000, సిద్ధకి చెందిన 12000 సూత్రీకరణలు, గ్రంథాలయం ఇప్పటికే చేర్చింది. అంతేగాక మేధోచౌర్యాన్ని నివారించేందుకు ప్రముఖ పేటెంట్ సంస్థలు యూరోపియన్ పేటెంట్ ఆఫీసు, యునైటెడ్ కింగ్‌డం పేటెంట్ ఆఫీసు, యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ ఆఫీసులతో, గ్రంథాలయంలోని సమాచారాన్ని సరిచూసుకునేలా ఒప్పందం చేసుకున్నది.