Jump to content

సాక్షి మడోల్కర్

వికీపీడియా నుండి
సాక్షి మడోల్కర్
జననం
సాక్షి సాగర్ మడోల్కర్

(2004-08-09) 2004 ఆగస్టు 9 (వయసు 20)
తల్లిదండ్రులు
  • సాగర్ మడోల్కర్ (కొరియోగ్రాఫర్) (తండ్రి)
  • కరిష్మా (తల్లి)
బంధువులుదిశా మడోల్కర్ (సోదరి)

సాక్షి సాగర్ మడోల్కర్ (జననం 2004 ఆగస్టు 9) మరాఠీ భాషకు చెందిన భారతీయ నటి. సందీప్ రాజ్ రూపొందిస్తున్న మోగ్లీ 2025 చిత్రంతో ఆమె టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది.[1]

విద్యాభ్యాసం

[మార్చు]

సాక్షి 2004 ఆగస్టు 9న ముంబైలో జన్మించింది. ఆమె కొరియోగ్రాఫర్ సాగర్ మడోల్కర్ కూతురు. ఆమె ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తిచేసింది. కెఈఎస్ ష్రాఫ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ నుంచి ఆమె డిగ్రీ చదివింది.

కెరీర్

[మార్చు]

లైఫ్ ఆఫ్ ఫైవ్ (2021) వెబ్ సీరీస్ లో నటించిన ఆమె నమకూల్ (2024)లో చేస్తోంది. 2022లో జహాన్ చార్ యార్ తో చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత, ఆమె బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన త్రీ మంకీస్ (2022)లో నటించింది. 2023లో వచ్చిన కునాల్ గంజావాలా మ్యూజిక్ వీడియో నైనా ఛల్కే లో ఆమె నటించింది.

మూలాలు

[మార్చు]
  1. "'మోగ్లీ'తో మరాఠీ భామ.. తెలుగులో ఎంట్రీ". Eenadu. Retrieved 2024-12-24.