Jump to content

కునాల్ గంజావాలా

వికీపీడియా నుండి
కునాల్ గంజావాలా
2012 లో కునాల్ గంజావాలా
వ్యక్తిగత సమాచారం
జననం (1972-04-14) 1972 ఏప్రిల్ 14 (వయసు 52)
పూనే, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తిసింగర్
క్రియాశీల కాలం2002–ప్రస్తుతం

కునాల్ గంజావాలా (జననం 1972 ఏప్రిల్ 14) ఒక భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతని పాటలు ఎక్కువగా హిందీ, కన్నడ చిత్రాలలో ఉంటాయి. అతను మరాఠీ, బెంగాలీ లతో పాటు భారతదేశంలోని ఇతర అధికారిక భాషలలో కూడా పాడాడు. కునాల్ జింగిల్స్ పాడటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. అతను 2004 లో మర్డర్ చిత్రం నుండి "భీగే హోంత్ తేరే" పాటతో హిందీ చిత్రసీమలో వెలుగులోకి వచ్చాడు. ఇది అతని మొదటి అతిపెద్ద హిట్ చిత్రం. ఈ పాట అతనికి 2005 లో ఉత్తమ నేపధ్య గాయకునిగా జీ సినీ అవార్డును సంపాదించింది.[1] 2005 లో ఆకాష్ చిత్రం నుండి "నీన్ నీన్" పాటతో కన్నడలో అతను వెలుగులోకి వచ్చాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

చిన్నతనంలో కునాల్ గంజవాలా గాయకుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అతను పాడగలడని కాలేజీ స్థాయి వరకు అతనికి తెలియదు. అప్పటి నుండి అతను ప్రతి కళాశాల ఉత్సవాల్లో పాడటం మొదలుపెట్టాడు. అనేక ఇంటర్-కాలేజీ పాటల పోటీలలో గెలిచాడు.

గంజవాలా మజాగావ్ లోని సెయింట్ పీటర్స్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను చార్టర్డ్ అకౌంటెంట్ లేదా నటుడిగా కావాలని కోరుకున్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకు గాయకుడిగా మారడానికి అవకాశం ఏర్పడిందని అతను తెలిపాడు. అతని సోదరి భారత్ నాట్యం కళాకారిణి. అతని తండ్రి హార్మోనికా వాద్యకారుడు. తన తల్లిదండ్రుల సహకారంతో అతను పాడటంపై యిష్టం ఏర్పరుచుకొని మంచి గాయకునిగా మారగననే నమ్మకం కలిగి ఉండేవాడు.

తరువాత, సుంధీంద్ర భౌమిక్ మార్గదర్శకత్వంలో భారతీయ విద్యా భవన్ నుండి గంజావాలా సంగీతం నేర్చుకున్నాడు. అతని మొదటి గానం ఆపరేషన్ ఫ్లడ్ ప్రకటన కోసం రంజిత్ బారోట్ స్వరపరిచిన జింగిల్ లో పాడాడు. తరువాత అనేక భాషా చిత్రాలలో పాటలు పాడాడు.

తెలుగు సినిమలలో పాటలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాట స్వరకర్తలు
2003 నీ మనసు నాకు తెలుసు కామ కామ ఎ. ఆర్. రెహమాన్
బాయ్స్ మారో మారో
ప్లీస్ సర్
2004 నాని స్పైడర్ మాన్
7 జి బృందావన్ కాలనీ మేం వయసుకు యువన్ శంకర్ రాజా
జనవరి మాసం
2005 బాలు ఎ.బిసిడి ఇ ఎఫ్ హైదరాబాద్ లడకా మణిశర్మ
2006 ధూం 2 టచ్ మి ప్రీతం చక్రవర్తి
సరదా సరదాగా ఎన్నో జన్మ జన్మల ఎస్.వి.కృష్ణారెడ్డి
పోకిరి జగడమే మణిశర్మ
చుక్కల్లో చంద్రుడు నవ్వుతూ రింగ్ టోన్ చక్రి
క్రిష్ గుండె ఆడిన రాజేష్ రోషన్
2008 వినాయకుడు నాలో వేదనే శాం ప్రసన్
రెడీ తూ తూ తూ దేవీశ్రీ ప్రసాద్
కృష్ణ దిల్ మాంగే మోర్ చక్రి
2009 తాజ్‌మహల్ ఎటు చూసినా ఎం. ఎం. శ్రీలేఖ
ఆర్య 2 కరిగే లోగా దేవీశ్రీ ప్రసాద్
గణేష్ జస్ట్ గణేష్ రాజ కుమారి మిక్కీ జె మేయర్
జోష్ దిందిరి దిందిరి సందీప్ చౌతా
తాజ్‌మహల్ ఎటు చూసినా ఎం. ఎం. శ్రీలేఖ
2010 సింహా జానకీ జానకీ చక్రి
అదుర్స్ నీతోనే దేవీశ్రీ ప్రసాద్
ఓం శాంతి చిన్న పోలికే ఇళయరాజా
చిన్న పోలికే
సింహా జానకీ జానకీ చక్రి
2012 నా యిష్టం నా ఇష్టం
2014 హార్ట్ అటాక్ ఎందుకిలా నన్ను వేదిస్తున్నావే అనూప్ రూబెన్స్
వేట ఐ లవ్ యు అంటున్నా చక్రి
రన్ రాజా రన్ కోమా కోమా కోమా ఘిబ్రాన్
2015 జాదూగాడు కథ కుదిరెగా సాగర్ మహతి

మూలాలు

[మార్చు]
  1. "IIFA awards 2005". Archived from the original on 21 సెప్టెంబరు 2013. Retrieved 16 జూలై 2020.