సాగునీటి ప్రాజెక్టుల వర్గీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాగునీటిని అందించే ప్రాజెక్టు సామర్ధ్యాన్ని బట్టి వీటిని వర్గీకరించారు.


1.చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు[మార్చు]

5వేల ఎకరాలు లేదా 2వేల హెక్టార్ల ఆయుకట్టు భూమి కంటే తక్కువ భూమికి నీటి వనరులు అందించే ప్రాజెక్టులను చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు అంటారు.

2.మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు[మార్చు]

5వేల ఎకరాల నుంచి 25వేల ఎకరాల ఆయుకట్టు భూమికి నీటి సౌకర్యాన్ని అందించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు అంటారు.

3.భారీ సాగునీటి ప్రాజెక్టులు[మార్చు]

25వేల ఎకరాల ఆయుకట్టు భూమి కంటే ఎక్కువ భూమికి నీటి వనరులను అందించే ప్రాజెక్టులను భారీ సాగునీటి ప్రాజెక్టులు అంటారు.

చిన్న సాగునీటి వనరులు అంటే[మార్చు]

చిన్న సాగునీటి వనరులు అంటే సరసులు, చెరువులు, కుంటలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆనకట్ట

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

సాక్షి దినపత్రిక(భవిత) - మే 2012