Jump to content

సాతాని వైష్ణవులు

వికీపీడియా నుండి

చాత్తాద శ్రీ వైష్ణవులు , శ్రీ వైష్ణవ మత సంప్రదాయానికి చెందిన వారు. శైవం, వీర శైవం ఆంధ్రదేశంలో విజృంభించిన తరువాత తెలుగు దేశంలో రామానుజుని వైష్ణవం ప్రవేశించింది. వైష్ణవ దేవాలయాల్లో గుడి సేవకులుగా ఒక వర్గం ఏర్పడిందనీ, వారినే సాతాను లంటారనీ, ఆరుద్ర గారు ప్రజాసాహితీ సంచికలో ఉదహరించారు.[1]

సాత్వత(చాత్తాద )శ్రీవైష్ణవ బ్రాహ్మణ అనుష్ఠానమ్

1.బాహ్య అనుష్ఠాన లక్షణములు

2. అంతర్ అనుష్ఠాన లక్షణములు

రెండు విధాలైన లక్షణాలను కలిగి ఉంటారు

1.బాహ్య అనుష్ఠాన లక్షణములు:

  యే కంఠలగ్న తులసీ నళినాక్షమాల

  యే బాహుమూలపరిచిహ్నిత శంఖ చక్రాః

  యే వా లలాటఫలకేలసధూర్ద్వపుండ్రాస్తే

   విమలోపవీత భవనమాశు పవిత్ర యంతిః

కంఠమునందు తులసి తామర పూస మాలలు ధరించి బాహుమూలముల యందు తాపశంఖ చక్ర చిహ్నాలు కలిగి ముఖమున చక్కటి ఊర్ధ్వపుండ్రములను ధరించి యజ్ఞోపవీతమును ధరించి పవిత్రుడై ఉండువాడు చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణుడు .ఇక్కడ ఊర్ధ్వపుండ్రము ధరించినప్పుడు భగవంతుని పాదము వలె స్పష్టంగా రెండువైపులా సమముగా ఉండవలెను  మధ్యలోని శ్రీ చూర్ణం దీపపు కాంతి వలె ఊర్ధ్వ ముఖంగా సుస్పష్టముగా ఉండవలెను,

2.అంతర్ అనుష్ఠాన లక్షణములు :

.పూర్తిగా ప్రాపంచిక విషయాంతరములను త్యజించాలి.

.శ్రీమన్నారాయణ్ణున్ని మాత్రమే ఆశ్రయించాలి.

శాశ్వత లక్ష్యమును సాఫల్యం చేయుట యందు పూర్తివిశ్వాసముంచాలి.

ఆ లక్ష్యసాధనకై ధృడమైన కోరికను కలిగి ఉండాలి.

భగవానుని కళ్యాణగుణములను అనుభవిస్తు కైంకర్య అభిలాష కలిగి ఉండాలి.

భాగవతుల వైభవం,గుణములును తెలుసుకొని వారిననుసరించాలి.

నిత్యం తిరుమంత్రం మరియు ద్వయమంత్రములందు స్థిరమైన అభినివేశం కలిగి ఉండాలి.

స్వాచార్యుల యందు విపరీతాభిమానం కలిగి ఉండాలి.

భగవానుని యందు ఆచార్యుని యందు సదా ఉపకారబుద్ధిని కలిగి ఉండాలి.

ఙ్ఞానులైన సాత్విక శ్రీవైష్ణవులతో సదా సత్సంగముచేస్తుండాలి.

సతతము శ్రద్ధతో శ్రీమన్నారాయణుని మాత్రమే పూజిస్తూ ఆయనే అక్షర అవ్యక్తమైన పరబ్రహ్మం అని ఉపాసించేవారు సాత్వత(చాత్తాద )శ్రీవైష్ణవ బ్రాహ్మణులు

.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి. "సాతాని వైష్ణవులు" . తెలుగువారి జానపద కళారూపాలు  – via Wikisource.

యితర లింకులు

[మార్చు]