సాత్త్వికాభినయం
Appearance
సాత్త్వికాభినయం చతుర్విధ అభినయాలులో నాలుగవ అభినయం. నాలుగు అభినయాలలో ఈ సాత్త్వికాభినయానికి ప్రత్యేకస్థానం ఉంది.[1]
రకాలు
[మార్చు]సత్త్వమనగా హృదయంలో ఆవిర్భవించిన భావం. ఇది మానవుల హృదయాలలో అవ్యక్తంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి నటించడమే సాత్త్వికాభినయం.[2] భావ ప్రకటన అనేది ఈ సాత్త్వికాభినమే.
ఇది రెండు విధాలుగా ఉంటుంది.
- అంతరం: మనసును ఆశ్రయించుకొని ఉంటుంది.
- బాహ్యం: దేహాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది.
విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి: అని భరతుడు చెప్పడం వల్ల ప్రేక్షకులలో అణిగివున్న రసాలను విభావానుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల నటుడు రసానుభూతి పొందగలుగుతాడు. ఇలా ప్రేక్షకులలో రసానుభూతిని కలిగించడమే సాత్త్వికాభినయం.[3]
ఇతర వివరాలు
[మార్చు]- పి.ఎస్.ఆర్. అప్పారావు రాసిన సాత్త్వికాభినయం పుస్తకాన్ని 1993లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ ఆర్కైవ్, పుస్తకాలు (1993). "సాత్త్వికాభినయం (ప్రస్తావన)". www.archive.org. తెలుగు విశ్వవిద్యాలయం. p. 2. Retrieved 20 April 2020.
- ↑ telugu, NT News (2021-09-05). "'వాగ్భూషణమే భూషణం' అని చెప్పినవారు?". Namasthe Telangana. Archived from the original on 2021-09-05. Retrieved 2022-10-18.
- ↑ సాత్త్వికాభినయం, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.635.