సానికొమ్ము పిచ్చిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సానికొమ్ము పిచ్చిరెడ్డి
సానికొమ్ము పిచ్చిరెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994 , 1999 - 2004
నియోజకవర్గం దర్శి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1947
పేరారెడ్డిపల్లి గ్రామం, కొనకనమిట్ల మండలం , ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 14 అక్టోబర్ 2021
ఒంగోలు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానం శ్రీనివాసరెడ్డి, అపర్ణ, హిమబిందు

సానికొమ్ము పిచ్చిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యుడు, రాజకీయ నాయకుడు. ఆయన దర్శి నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

సానికొమ్ము పిచ్చిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, పేరారెడ్డిపల్లి గ్రామంలో 1947లో జన్మించాడు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి పొదిలిలో ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సానికొమ్ము పిచ్చిరెడ్డి 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985లో కాంగ్రెస్ పార్టీ నుండి దర్శి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. సానికొమ్ము పిచ్చిరెడ్డి 1987లో పొదిలి ఎంపీపీగా గెలిచి, 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు 1994లో కాంగ్రెస్ టికెట్ దక్కలేదు, తిరిగి ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

మరణం[మార్చు]

డాక్టర్‌ సానికొమ్ము పిచ్చిరెడ్డి అనార్యోగంతో బాధపడుతూ ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 అక్టోబరు 14న మరణించాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (14 October 2021). "మాజీ ఎమ్మెల్యే 'సానికొమ్ము' ఇక లేరు". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  2. Eenadu (15 October 2021). "దర్శి మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి కన్నుమూత". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  3. Sakshi (14 October 2021). "దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.