సాఫ్ట్ వేర్ బ్లూస్
స్వరూపం
సాఫ్ట్‌వేర్ బ్లూస్ | |
---|---|
దర్శకత్వం | ఉమా శంకర్ |
రచన | ఉమా శంకర్ |
నిర్మాత | వీకే రాజు |
తారాగణం | శ్రీరామ్ నిమ్మల, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేయస్ రాజు |
ఛాయాగ్రహణం | నిమ్మ గోపి |
కూర్పు | వి.కె. రాజు |
సంగీతం | సుభాష్ ఆనంద్ |
నిర్మాణ సంస్థ | సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ |
విడుదల తేదీ | 24 జూన్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సాఫ్ట్‌వేర్ బ్లూస్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై వీకే రాజు నిర్మించిన ఈ సినిమాకు ఉమా శంకర్ దర్శకత్వం వహించాడు.[1] శ్రీరామ్ నిమ్మల, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేయస్ రాజు, బస్వరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మంత్రి కేటీఆర్ మే 20న విడుదల చేయగా[2] జూన్ 24న విడుదలైంది.[3]
కథ
[మార్చు]భార్గవ్ (శ్రీరాం నిమ్మల) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తూ ఆ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పొందిన వారికి అమెరికాలో గ్రీన్ కార్డు గిఫ్ట్ గా ఇస్తుందని ప్రకటిస్తారు. ఈ క్రమంలో అక్కడే పని చేసే టీం లీడర్ యక్ష్య (భావన)ను చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో భార్గవ్ బెస్ట్ అవార్డు అది సాధించాడా లేదా ? తాను ప్రేమించిన యక్ష్య ప్రేమను గెలుచుకొన్నాడా ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- శ్రీరామ్ నిమ్మల
- భావన
- ఆర్యమాన్
- మహబూబ్ బాషా
- కేయస్ రాజు
- బస్వరాజ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్
- నిర్మాత: వీకే రాజు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉమా శంకర్
- సంగీతం: సుభాష్ ఆనంద్
- సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (17 December 2021). "ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
- ↑ Namasthe Telangana (22 June 2022). "సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కష్టాలతో 'సాఫ్ట్‌వేర్ బ్లూస్' ట్రైలర్..లాంఛ్ చేసిన మంత్రి కేటీఆర్". Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
- ↑ Eenadu (22 May 2022). "వినోదభరితంగా సాఫ్ట్‌వేర్ బ్లూస్". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.