Jump to content

సార్వత్రిక సూచిక

వికీపీడియా నుండి
సార్వత్రిక సూచిక కాగితం

సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అనునది 1 నుండి 14 అవధిలో గల ఆమ్ల క్షార ద్రావణాల పి.హెచ్ విలువల ఆధారంగా వివిధ రంగులను మార్చే అనేక సమ్మేళనాలతో కూడిన ద్రావణం. ఇది కూడా ఒక పి.హెచ్ సూచిక. అనేక సంఖ్యలో వాణిజ్యపరంగా పి.హెచ్ సూచికలు ఉన్నప్పటికీ 1923లో యమడా చే పేటెంట్ చేయించబడ్డ ఫార్ములా యొక్క మార్పులకు అనుగుణంగానే అనేకమైన సూచికలు ఉన్నాయి.[1] ఈ పేటెంట్ హక్కుల వివరాలను "కెమికల్ ఆబ్‌స్ట్రాక్ట్స్"లో కనుగొనవచ్చు.[2]

పి.హె. విలువలు 1 నుండి 14 వరకు నిర్ణయించుటకు వివిధ రంగులతో కూడిన వివిధ సూచికలు కూడా అందుబాటులో ఉన్నాయి. రంగులతో కూడిన ఛార్టులు వాటితో బాటు నిర్ధిష్ట పరీక్ష కాగితములు అమ్మబడుతున్నవి. ఈ సార్వత్రిక సూచిక పి.హెచ్ విలువ 4 గా గల మెగ్నీషియం హైడ్రాక్సైడుతో తయారుచేయబడుచున్నవి.

సార్వత్రిక సూచికలో సాధారణంగా నీరు, ప్రోపన్-1-ఆల్, ఫినాప్తలీన్ సోడియం లవణము, సోడియం హైడ్రాక్సైడ్, మిథైల్ రెడ్, బ్రోమోథిమోల్ బ్లూ మోనో సోడియం లవణము, థైమోల్ బ్లూ పదార్థాలతో కూడి ఉంటుంది.[3] ఈ సార్వత్రిక సూచికనుపయోగించి వివిధ రకాల పి.హెచ్ విలువ గల ద్రావణాలను తెలుసుకొనుటకు ఈ క్రింది పట్టిక చూడండి.

pH అవధి వివరణ రంగు
<3 బలమైన ఆమ్లం ఎరుపు
3-6 ఆమ్లం ఆరెంజ్/పసుపు
7 తటస్థ ద్రావణం ఆకుపచ్చ
8-11 క్షారం నీలం
> 11 బలమైన క్షారం ఊదా/పర్పల్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Jap. Pat. 99,664, Feb 21, 1933
  2. For a discussion of these experiments, as well as recipes for Yamada and other universal indicators, see Foster, S.L. and Gruntfest, J.Chem.Educ., 14, 274 (1937)
  3. "Universal Indicator Archived 2006-09-25 at the Wayback Machine". ISCID Encyclopedia of Science and Philosophy.