సాలుమరద తిమ్మక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాలుమరద తిమ్మక్క
జననం
హులికల్ గ్రామం, రామనగర జిల్లా, కర్ణాటక
వృత్తిపర్యావరణవేత్త
జీవిత భాగస్వామిచిక్కయ్య
పురస్కారాలుభారత జాతీయ పౌరసన్మానం

సాలుమరద తిమ్మక్క కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త. ఈమె హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు.[1][2] ఈమె పర్యావరణానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం భారత జాతీయ పౌర పురస్కారంతో తిమ్మక్కను గౌరవించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె కర్నాటక లోని తూముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జన్మించారు. ఈమె తల్లి పేరు విజయమ్మ, సాలుమరద అంటే కన్నడ భాషలో వృక్షాల వరుస అని అర్థం. ఈమె బెంగళూరు రూరల్ జిల్లా, హులికల్ గ్రామానికి చెందినది.[3] అమెరికాలోని లాస్ ఏంజలెస్, ఓక్లాండ్, కాలిఫోర్నియాలలో స్థాపించిన  పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద తిమ్మక్కాస్ రీసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టడం విశేషం.[4] ఈవిడకు చదువులేకపోయినా వేలిముద్ర వేస్తారు. ఏదైనా సేవ చేయాలంటే చదువు అవపరంలేదు. చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అని చెప్తుంటారు.[5]

ఆమె భర్త పేరు చిక్కన్న. భార్య నాటిన చెట్లను జాగ్రత్తగా నీళ్ళు పోసి పెంచడం కోసం జీతం కోసం చేస్తున్న పని కూడా వదిలిపెట్టాడు. ఆ సమయంలో తిమ్మక్క సంపాదనే ఆ కుటుంబానికి జీవనాధారం అయింది. 1990 లో చిక్కన్న మరణించాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఉమేష్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు

.

మొక్కలు నాటాలనే ఆలోచనకు బీజం[మార్చు]

పెళ్లయి 20 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఆ భాధలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లవుతుందని బావించి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. వాటిని సొంత బిడ్డల్లా ప్రేమించి జాగ్రత్తగా పెంచి కాపాడారు. చెట్లే కదా నా పిల్లలు అని చెపుతుంటారు. ఆమె భర్త కూడా సహకరించి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆమె అడుగులో అడుగేసి నడిచారు. అలా ఇద్దరూ కలసి ప్రకృతికి ప్రణామం చేశారు. పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేశారు. పిల్లలు లేని ఈ వృద్ధ దంపతులు మొక్కలనే పిల్లలుగా భావించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

చిత్రమాలిక[మార్చు]

గుర్తింపు[మార్చు]

పద్మశ్రీపురస్కారం
  • 1995 లో కేంద్రప్రభుత్వం ఆమెను భారతీయ పౌర పురస్కారంతో సన్మానించింది.
  • 1997 లో ఇందిర ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం లభించింది.
  • లాస్‌ఏంజెలిస్‌, ఓక్లాండ్‌, కాలిఫోర్నియాల్లో స్థాపించిన పర్యావరణ సంస్థలకు ‘తిమ్మక్కాస్‌ రీసోర్సెస్‌ ఫర్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఎడ్యుకేషన్‌’ అని పేరు పెట్టడం
  • 2019లో పద్మశ్రీ వచ్చింది.
  • జాతీయ పౌరసత్వ పురస్కారం - 1
  • ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు - 1
  • వీరచక్ర అవార్డు -
  • కర్ణాటక ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ నుండి అక్రిడిటేషన్ సర్టిఫికేట్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరుచే ప్రశంసల సర్టిఫికేట్.
  • కర్ణాటక కల్పవల్లి అవార్డు -
  • గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ బ్రేవరీ అవార్డు -
  • పంపపతి పర్యావరణ పురస్కారం
  • బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు
  • వనామాటే అవార్డు
  • మగడి వ్యక్తి అవార్డు
  • శ్రీమత అవార్డు
  • హెచ్.హోన్నై సోషల్ సర్వీస్ అవార్డు
  • కర్ణాటక పర్యావరణ పురస్కారం
  • ఉమెన్స్ ఎలుక అవార్డు
  • జాతీయ పౌర పురస్కారం
  • రాజ్యోత్సవ అవార్డు
  • ఫ్లవర్ ఫ్లవర్ ఫౌండేషన్ విజ్డమ్ స్పిరిట్ అవార్డు
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుండి విశాలక్షి అవార్డు.
  • ఇది ప్రతిష్టాత్మక 'నాడోజా' అవార్డును గెలుచుకుంది.

ప్రస్తుత కార్యక్రమాలు[మార్చు]

దేశవ్యాప్తంగా అనేక అటవీ పెంపక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు స్పూర్తిని నింపేందుకు అతిధిగా వెళ్లి ప్రేరేపిస్తున్నారు. శతాధిక వృద్దురాలుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తన గ్రామ వార్షిక ఉత్సవానికి వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద ట్యాంక్ నిర్మాణంతో సహా ఇతర సామాజిక సేవా పనులలో పాల్గొంది. జాతియ నిధులతో తన గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేయిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. http://www.goodnewsindia.com/Pages/content/inspirational/thimmakka.html
  2. A biography of Thimmakka is provided by B. R. Srikanth. "Thimmakka's Green Crusade Transforms Heat-And-Dust Hulikal". Online Edition of The Outlook, dated 1999-05-03. © Outlook Publishing (India) Private Limited. Retrieved 2007-05-23.
  3. "ఇవి తిమ్మక్క మర్రిమానులు!". sakshi.com. సాక్షి. Retrieved 4 March 2017.
  4. "About Thimmakka". Online Webpage of Thimmakka.org. Thimmakka's Resources for Environmental Education. Archived from the original on 2006-12-31. Retrieved 2007-05-23.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-29.