సావిత్రి (ఈస్టిండియా)
Jump to navigation
Jump to search
సావిత్రి (1933 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్తజల్లు పుల్లయ్య |
---|---|
రచన | మల్లాజోశ్యుల రమణమూర్తి |
తారాగణం | వేమూరి గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు, రామతిలకం, సురభి కమలాబాయి |
నిర్మాణ సంస్థ | ఈస్టిండియా ఫిల్మ్స్ |
నిడివి | 125 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సతీ సావిత్రి 1933లో ఈస్టిండియా పిలిమ్స్ ద్వారా సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించబడిన తెలుగు సినిమా. ఇది మైలవరం జమిందారు గారిచే స్థాపించబడిన బాలభారతీ సమాజము వారిచే ప్రదర్శింపబడుచున్న నాటకానికి అనువాదము. ఇది ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారి భారీ బడ్జెట్ చిత్రం. ఇది అప్పట్లో రూ.75,000 లతో నిర్మించిన భారీ హిట్ చిత్రం[1]
ఈ చిత్రం మహా భారతం సావిత్రి,సత్యవంతుల కథ. ఈ కథ ప్రకారం కథా పాత్ర సావిత్రి (రామతిలకం), ఒక సంవత్సరం లోపె మరణించే శాపం గల రాజు అయిన సత్యవంతుని వివాహం చేసుకుంటుంది. ఆమె యమధర్మరాజు (గగ్గయ్య) ను ఒప్పించి తన భర్తను పునరజ్జీవితుని కావించే వరం సంపాదించి కాపాడుకొంటుంది.
నటీనటులు
[మార్చు]పాత్రలు | నటీ నటులు |
సావిత్రి | రామతిలకం |
సత్యవంతుడు | నిడుముక్కల సుబ్బారావు |
అశ్వపతి | గోవిందరాజు వెంకటరామయ్య |
ద్యుమత్సేనుడు | ధర్మపురి బుచ్చిరాజు |
శారద్వతుడు | చిర్రావూరి దీక్షితులు |
నారదుడు | పారుపల్లి సత్యనారాయణ |
యముడు | వేమూరి గగ్గయ్య |
మాళవి | పార్వతీ బాయి |
శైబి | పద్మావతీ బాయి |
వాసంతిక | లలిత |
సావిత్రీ దేవి | సుగుణ |
కీర్తనలు
[మార్చు]క్రమ సంఖ్య | కీర్తన | ఆలపించినవారు |
1 | లాలి నీరజనేత్ర లావణ్యగాత్ర | మాళవి |
2 | సుఫలయామీ సుధా విలాసీ | సావిత్రి |
3 | ఈశ్వరసంకల్ప మెవ్వరెరుంగుదురు | సత్యవంతుడు |
4 | పోయెనయ్యో యిపుడు ననుబాసి | సత్యవంతుడు |
5 | తీయనిదౌ నీ విలాస మెడద దలపగ | సావిత్రి |
6 | జగన్మోహనాకార శ్యామసుందరా | నారదుడు |
7 | కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును | నారదుడు |
8 | తగునా యిది జనకా | సావిత్రి |
9 | మధుసూదనా హే మాధవా | నారదుడు |
10 | నా హృదయఫలకమునయా నాతి రూపురేఖా | సత్యవంతుడు |
11 | హా వనటనొంద తగునా నీకు జనకా | సావిత్రి |
12 | జై సావిత్రి హిమశైలపుత్రి పావనగాత్రి | సావిత్రి |
13 | ప్రాణనాథ నీతోడవత్తునా | సావిత్రి |
14 | ఆహాకాంత యీ యుగ్రవనంబెంతో రమణీయం | సావిత్రీ సత్యవంతులు |
15 | సుజనజనావన శౌరీ సుమనోహరీ | నారదుడు |
16 | పోవుచున్నాడే నా విభుని జీవనములను | సావిత్రి |
17 | బాల పొమ్మికన్ యీ యుగ్రారణ్యంబున రావలదు | సావిత్రి యముడు |
18 | సరసిజాక్షి నీవీ పథమున నడువగ | యముడు |
19 | దీర్ఘాయురస్తు ధాత్రీపాలానాప్రాప్తి | నారదుడు |
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- సతీ సావిత్రి (1933): తొలినాటి సినిమా పాటల పుస్తకములు.