నిడుముక్కల సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిడుముక్కల సుబ్బారావు

నిడుముక్కల సుబ్బారావు (మార్చి 10, 1896 - ఏప్రిల్ 17,1968) రంగస్థల నటుడు, మైలవరం బాలభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి.

జననం[మార్చు]

ఈయన 1896 మార్చి 10వ తేదీన విజయవాడలో జన్మించాడు.

రంగస్థల ప్రవేశం[మార్చు]

మొట్టమొదట బందరు ‘చిత్రకళాభివర్దిని’ సామాజంలో బాలవేషాలలో నటించి తరువాత మైలవరం కంపెనీలో చేరి అఖండ ఖ్యాతి గడించాడు.

నటించిన పాత్రలు[మార్చు]

శ్రీకృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, శిశుపాలుడు, అశ్వనీదేవత (సుకన్య), భీష్మ, బబ్బిలి రంగారావు, జలంధరుడు, బిల్వమంగళుడు, ఖడ్గ నారాయణుడు, మన్మధుడు (అనసూయ), శ్రీరాముడు, భరతుడు, నారదుడు, గిరిరాజు (చండిక), క్రూరసేనుడు మొదలైనవి.

బిరుదులు[మార్చు]

  • రంగభూషణ
  • నాట్య విశారద

మరణం[మార్చు]

చివరి దశలో లారీ నడిపిస్తూ 1968, ఏప్రిల్ 17న మరణించాడు.

మూలాలు[మార్చు]

  • నిడుముక్కల సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 658.