Jump to content

సాహితీ ఆర్ట్ థియేటర్స్, గుంటూరు

వికీపీడియా నుండి

సాహితీ ఆర్ట్ థియేటర్స్ గుంటూరులో స్థాపించబడిన నాటక సంస్థ. దీనిని 1950లలో బి.కె.విశ్వేశ్వరరావు, జి.ఎస్.ఎన్.మూర్తి, ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు ఉమ్మడిగా స్థాపించారు.

వీరు శ్రీకృష్ణ రాయబారం, వేణీ సంహారం, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాబారం, బలరామ విజయం, ధర్మ విజయం మొదలైన పౌరాణిక నాటకాలను ప్రదర్శించింది.

ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు ప్రసిద్ధ నాటక రచయిత, నటుడు. ఆంజనేయులు బలరామ విజయం అనే లక్షణ పరిణయం నాటకాన్ని, ధర్మ విజయం అనే ఘోషయాత్ర నాటకాన్ని రచించారు. భీముని వేషంలో ప్రసిద్ధిచెందిన విశ్వేశ్వరరావు 2006లో పరమపదించారు.