సాహిల్ దోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాహిల్ దోషి భారతీయ అమెరికన్ "యంగ్ సైంటిస్ట్". ఇతను కార్బన్ డయాక్సైడ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసే వినూత్న పరికరాన్ని రూపొందించాడు. ఇతను గృహ వినియోగం కోసం విద్యుత్‌ను అందించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పర్యావరణానికి మేలు చేసే ‘పొల్యూసెల్’ అనే పరికరాన్ని రూపొందించినందుకుగాను 2014లో ‘అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం మొత్తం 9 మంది ఫైనలిస్టులతో పోటీపడి సాహిల్ ఈ అవార్డును గెలుపొందాడు. ఈ అవార్డు కింద సాహిల్‌కు $25,000 (రూ.15.30 లక్షలు) నగదుతో పాటు కోస్టా రికా ప్రదేశానికి విద్యార్థి సాహస యాత్ర అవకాశం లభించింది. 14 ఏళ్ల వయస్సున సాహిల్ ప్రస్తుతం అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 23-10-2014 - (భారతీయ అమెరికన్ "యంగ్ సైంటిస్ట్")