సింగరి శంకరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సింగరి శంకరయ్య భారత స్వాతంత్ర్యసమరయోధుడు.

హైరతాబాదు గణేశ్ ఉత్సవ రూపకర్త[మార్చు]

ఆయన ఒకప్పటి ఖైరతాబాదు కౌన్సిలర్. వీరు ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలకి రూపకర్త. 1954వ సంవత్సరంలో వీరు ఖైరతాబాదు ఉత్సవాలను ప్రారంభించారు.[1][2] స్వాతంత్య్ర పోరాట సమయంలో బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఖైరతాబాద్‌లో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. శంకరయ్య తదనంతరం ఆయన సోదరుడు సుదర్శన్ ఆ బాధ్యతలను తలకెత్తుకొని ఆయన కొడుకు సింగరి రాజ్‌కుమార్‌తో కలిసి ఉత్సవాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.[3] 1954 సెప్టెంబరు 8న మొట్టమొదటిగా ఒక చిన్న మండపాన్ని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు. కేవలం వంద రూపాయలలోపు ఖర్చుతోనే ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రతి ఏడాదీ ఒక అడుగు వంతున విగ్రహం ఎత్తును పెంచాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.[4]

ఆయన 1994లో మరణించాడు.[5]

మూలాలు[మార్చు]