సింధురాజా
సింధురాజా | |
---|---|
Kumara-Narayana, Nava-Sahasanka | |
King of Malwa | |
పరిపాలన | c. 990s |
పూర్వాధికారి | Vakpati Munja |
ఉత్తరాధికారి | Bhoja |
వంశము | Bhoja |
రాజవంశం | Paramara |
సింధురాజా పరామరా రాజవంశం నుండి వచ్చిన ఒక భారతీయ రాజు. ఆయన 10 వ శతాబ్దం చివరిలో మాళ్వా ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన అన్న ముంజా, ఆయన తండ్రి భోజుడు.
నేపథ్యం
[మార్చు]సింధురాజ జారీ చేసిన శాసనాలు కనుగొనబడలేదు. భోజుడి శాసనాలతో అనేక తరువాత పరమారా శాసనాలలో ఆయన జీవితం గురించి పేర్కొనబడింది. చాలా సమాచారం ఆయన ఆస్థాన కవి పద్మగుప్తుడు వ్రాసిన నవ-సహసంక-చరితలో ఆయన గురించి పేర్కొనబడింది. కె.సి జైను ఈ రచన చరిత్ర, పురాణకథనాల కలయికగా ఉంది.[1]
సింధురాజా తన సోదరుడు ముంజా తరువాత పరామరా రాజుగా వచ్చాడు. 14 వ శతాబ్దపు కవి మేరుతుంగా ప్రబంధ-చింతామణి అభిప్రాయం ఆధారంగా సింధురాజా సింహదంతభట్ట (సియాకా)స్వంత కుమారుడని ముంజా దత్తత సంతానం అని పేర్కొన్నది. ఏదేమైనా చరిత్రకారులు ఈ వాదన ప్రామాణికతను అనుమానిస్తున్నారు.[2] ముంజా తరువాత సింధురాజా కుమారుడు భోజుడు వచ్చాడని మేరుతుంగా పేర్కొన్నాడు. ఏదేమైనా నవ-సహసంకా-చరిత, ఎపిగ్రాఫికు సాక్ష్యాల ఆధారంగా సింధురాజా ముంజా వారసుడని భావిస్తున్నారు.[3]
సింధురాజ "కుమార-నారాయణ", "నవ-సహసంకా" అనే బిరుదులను స్వీకరించారు. పద్మగుప్తుడు అవంతీశ్వర (అవంతి ప్రభువు), మాళవ-రాజా (మాలావా రాజు), పరమమహిభృతా అనే బిరుదులను కూడా ఉపయోగిస్తారు.[4] అతని ఇతర పేర్లు సింధులా, సింధాలా.[5]ఆయన వారసుడు భోజుడి శాసనాలలో ఆయనను "సింధు-రాజా-దేవా" అని పిలుస్తారు.[6]
పాలనా కాలం
[మార్చు]సింధురాజా పాలన కచ్చితమైన కాలం గురించిన ఆధారాలు లేవు. ఆయన పూర్వీకుడు ముంజా క్రీ.పూ. 994, క్రీ.పూ 998 మధ్య కొంతకాలం మరణించాడు.[7]
మోడసా రాగి ఫలకాలు (సా.శ.1010) ఆయన వారసుడు భోజుడు పాలన తొలి చారిత్రక నమోదిత ఆధారాలుగా భావించబడుతున్నాయి. చింతామణి-సర్నికా (సా.శ. 1055) ను భోజుడి ఆస్థానకవి దాసబాల స్వరపరిచారు.[8] దీని ఆధారంగా ప్రతిపాలు భాటియా వంటి పండితులు భోజుడి పాలనను సా.శ.1010-1055 వరకు సింధురాజా పాలనను సా.శ. 997-1010 వరకు కేటాయించారు. అయితే భోజుడు 55 సంవత్సరాలు పాలించినట్లు మేరుతుంగ ప్రబంధ-చింతామణి పేర్కొంది. ఈ సమాచారం సరైనదని ఊహిస్తే కైలాషు చంద్ర జైను వంటి పరిశోధకులు భోజుడి పాలనను సా.శ. 1000–1055, సింధురాజా పాలన సా.శ.995-1000 గా భావిస్తారు.[3]
సైనిక జీవితం
[మార్చు]పరామరా ఆస్థానకవి ధనపాల రచించిన తిలక-మంజరి, సింధురాజను గొప్ప కథానాయకుడు, "ఇంద్రుని ఏనుగులను జయించగలిగిన సింహం" అని ప్రశంసించారు. [9] సింధురాజ కుంతల రాజును ఓడించాడని నవ-సహసంక-చరిత అలాగే తరువాతి పరామరా రాజు ప్రభుత్వ ఉదయపూరు ప్రశస్తి శాసనం పేర్కొన్నది. పరామరా రాజ్యం దక్షిణ సరిహద్దులోని భూభాగాలను ఆయన తిరిగి స్వాధీనం చేసుకున్నాడని ఇది సూచిస్తుంది. ఆయన పూర్వీకుడు ముంజా కల్యాణి చాళుక్య రాజు రెండవ తైలాపా చేతిలో ఓడిపోయాడు. అయితే తైలాపా వారసుడు సత్యాశ్రయతో సింధురాజా పోరాడాడా అనేది స్పష్టంగా తెలియదు.[4]
నాగ-సహసంకా-చరిత సింధురాజు నాగ యువరాణి శశిప్రభా గెలిచుకోవడానికి రాక్షస రాజు వజ్రాంకుశను ఓడించినట్లు పాక్షిక-పౌరాణిక కథనం వివరిస్తుంది; ఈ పోరాటంలో ఆయనకు విద్యాధర నాయకుడు శశిఖండ మద్దతు ఇచ్చాడు. చరిత్రకారుడు వి.ఎస్. పాథకు, శశిఖండ ఉత్తర శిలహర రాజు అపరాజితకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వజ్రాంకుశ దక్షిణ శిలహర రాజు రత్తరాజాకు ప్రాతినిధ్యం వహించాడని భావించారు. [10] నాగాలు కరాహట (ఆధునిక కరాడు) సిండా రాజవంశానికి ప్రాతినిధ్యం వహించాయని పాథకు అభిప్రాయపడ్డాడు.[11] ఇది పౌరాణిక నాగాల ఆధారంగా స్వీకరించబడిందని పేర్కొంది. [12]
ఈ కథనం సింధురాజకు హ్యూణులు, వాగడ, మురాలా, లతా, అపరాంత, కోసల దేశాలతో సహా అనేక ఇతర విజయాలు సాధించిన ఘనత ఇచ్చింది:[4]
- హ్యూణుల మీద విజయం సాధించిన వాదన ఆయన పూర్వీకుడు ముంజా హ్యూణ వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం మీద ఆధారపడి ఉండవచ్చు. ఆయన పరామరా మూలాలలో హ్యూణులను లొంగదీసుకున్న ఘనత కూడా ఉంది.[4]
- వాగాడ మీద విజయం ఆయనను చందాపాలను లొంగదీసుకోవటానికి సూచన కావచ్చు. ఆయన పూర్వీకుడు కంక వాగాడ ప్రాంతాన్ని పరామారా అధీనంలో పాలించాడు. ఎవరు స్వాతంత్ర్యాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించారన్నది ప్రశ్నార్ధకంగా ఉంది.[4]
- మురళలను సాధారణంగా నేటి కేరళగా గుర్తిస్తారు. సింధురాజా దక్షిణాదిలో అంత దూరం వెళ్ళే అవకాశం లేదు. ఈ ప్రాంతానికి చెందిన ఒక పాలకుడు సింధురాజాకు వ్యతిరేకంగా చాళుక్యుల లేదా శిలాహరాల అధీనుడుగా లేదా మిత్రుడుగా పోరాడటానికి అవకాశం ఉంది.
- లతా చాళుక్య పాలకుడు గోంగిరాజా లతా పాలకుడు ఉన్నాడని భావిస్తున్నారు.[4]
- అపరాంత లేదా ఉత్తర కొంకణప్రాంతాన్ని శిలాహరులు పాలించారు. సింధురాజ ఈ ప్రాంతాన్ని జయించాడనే వాదన సాంప్రదాయిక అతిశయోక్తి అనిపిస్తుంది. ఎందుకంటే శిలాహరా యువరాజు అపరాజిత మిత్రునిగా తన పోరాటంలో పాల్గొన్నాడని విశ్వసిస్తున్నారు (పైన నవ-సహసంకా-చరిత కథ చూడండి). అపరాజిత తన క్రీ.పూ 997 భదను రాగి ఫలక శాసనంలో, చాళుక్యులచే రాష్ట్రకూటలను పడగొట్టినందుకు చింతిస్తున్నాడు. చాళుక్యులకు వ్యతిరేకంగా తనను తాను రక్షించుకోవడానికి పరామరాలతో ఒక కూటమిని ఏర్పరచుకొని ఉండవచ్చు.[13]
- కోసల మీద విజయం సాధించిన వాదన నిజమైతే ఇది రత్నపుర కలచురి పాలకుడు కళింగరాజ లేదా సోమవంశీ పాలకుడు యయాతి మహాశివగుప్తుడి మీద సింధురాజ సాధించిన విజయానికి సూచన కావచ్చు. [13]
గుజరాతులోని చాళుక్య రాజవంశం సా.శ. 1151 వాడ్నగరు ప్రశాస్తి శాసనం ఆధారంగా వారి రాజు చాముండరాజా సింధురాజా మీద సైన్యాన్ని నడిపించాడు. శాసనం ప్రకారం సింధురాజా చాముండరాజు సైన్యాన్ని దూరం నుండి చూసినప్పుడు ఆయన తన ఏనుగు దళాలతో పారిపోయి అప్పటివరకు బాగా స్థిరంగా ఉన్న కీర్తిని కోల్పోయాడు.[14] లతా పాలకుడు చముండరాజకు సామంతుడు అని తెలుస్తుంది. సింధురాజ లత మీద దాడి చేయడం చాముండరాజును స్వీయ రక్షణకు ప్రేరేపించింది. 14 వ శతాబ్దపు రచన కుమారపాల-చరిత చముండరాజు సింధురాజను యుద్ధంలో చంపాడని పేర్కొంది. ఈ రచనను జైన రచయిత జయసింహ సూరి రాశాడు. ఆయనను గుజరాతు చాళుక్యులు పోషించారు. ఏదేమైనా ఈ వాదన చారిత్రాత్మకత సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇది మునుపటి మూలాల్లో కనిపించదు.[15][13]
కచ్చపాఘాట పాలకుడు మహిపాల సా.శ. 1092 సాసుబహు ఆలయ శాసనం ఆధారంగా ఆయన పూర్వీకుడు కీర్తిరాజా మాళవ యువరాజును ఓడించాడు. ఆయన సైనికులు యుద్ధభూమి నుండి పారిపోయి వారి ఈటెలను విడిచిపెట్టారు. మునుపటి పరిశోధకులు పరాజయం పాలైన రాజును సింధురాజా కుమారుడు, వారసుడు భోజుడిగా గుర్తించారు. కాని ఈ రాజు సింధురాజా అయి ఉండవచ్చని చాలా అధికంగా భావిస్తున్నారు. తెలుస్తుంది.[13]
మూలాలు
[మార్చు]- ↑ A. K. Warder 1992, p. 1.
- ↑ K. N. Seth 1978, p. 88.
- ↑ 3.0 3.1 K. C. Jain 1972, p. 341.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Arvind K. Singh 2012, p. 18.
- ↑ K. N. Seth 1978, p. 87.
- ↑ H. V. Trivedi 1991, p. 29.
- ↑ M. Srinivasachariar (1974). History of Classical Sanskrit Literature. Motilal Banarsidass. p. 502. ISBN 9788120802841.
- ↑ Kirit Mankodi 1987, pp. 71–72.
- ↑ G. P. Yadava 1982, p. 38.
- ↑ A. K. Warder 1992, pp. 10–11.
- ↑ A. K. Warder 1992, p. 11.
- ↑ A. K. Warder 1972, pp. 42–43.
- ↑ 13.0 13.1 13.2 13.3 Arvind K. Singh 2012, p. 19.
- ↑ Arvind K. Singh 2012, pp. 18–19.
- ↑ Asoke Kumar Majumdar 1956, pp. 34–35.
గ్రంధసూచిక
[మార్చు]- A. K. Warder (1992). Indian Kāvya Literature. Vol. 6: The Art of Storytelling. Motilal Banarsidass. ISBN 978-81-208-0615-3.
- A. K. Warder (1972). An Introduction to Indian Historiography. Popular Prakashan.
- Arvind K. Singh (2012). "Interpreting the History of the Paramāras". Journal of the Royal Asiatic Society. 22 (1): 13–28. JSTOR 41490371.
- Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan. OCLC 4413150.
- G. P. Yadava (1982). Dhanapāla and His Times: A Socio-cultural Study Based Upon His Works. Concept.
- Harihar Vitthal Trivedi (1991). Inscriptions of the Paramāras (Part 2). Corpus Inscriptionum Indicarum Volume VII: Inscriptions of the Paramāras, Chandēllas, Kachchapaghātas, and two minor dynasties. Archaeological Survey of India. doi:10.5281/zenodo.1451755.
- K. C. Jain (1972). Malwa Through the Ages, from the Earliest Times to 1305 A.D. Motilal Banarsidass. ISBN 978-81-208-0824-9.
- K. N. Seth (1978). The Growth of the Paramara Power in Malwa. Progress.
- Kirit Mankodi (1987). "Scholar-Emperor and a Funerary Temple: Eleventh Century Bhojpur". Marg. 39 (2). National Centre for the Performing Arts: 61–72.
వెలుపలి లింకులు
[మార్చు]- Nava-Sahasanka-Charita, an eulogistic composition on Sindhuraja's life by his court poet Padmagupta (in Sanskrit)