సింధు శ్రీహర్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింధు శ్రీహర్ష
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సింధు శ్రీహర్ష
పుట్టిన తేదీ (1988-08-17) 1988 ఆగస్టు 17 (వయసు 36)
బెంగళూరు, భారతదేశం
బ్యాటింగుకుడి-చేతొ
పాత్రవికెట్ కీపర్, బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 10)2019 మే 17 - కెనడా తో
చివరి T20I2022 సెప్టెంబరు 25 - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
కర్నాటక మహిళ
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 22
చేసిన పరుగులు 364
బ్యాటింగు సగటు 24.26
100లు/50లు 0/2
అత్యుత్తమ స్కోరు 74*
క్యాచ్‌లు/స్టంపింగులు 11/2
మూలం: Cricinfo, 10 November 2022

సింధు శ్రీహర్ష (జననం:1988 ఆగస్టు 17) ఒక భారతీయ సంతతికి చెందిన అమెరికన్ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె యునైటెడ్ స్టేట్స్ మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్.[1][2][3]

శ్రీహర్ష భారతదేశంలోని బెంగుళూరులో జన్మించింది.[4][5] ఆమె తన తొమ్మిదేళ్ల వయస్సు నుండి అధికారికంగా క్రికెట్ ఆడింది.[6] ఇరుగు పొరుగు అబ్బాయిలతో ఏడేళ్ల వయస్సులో అనధికారికంగా శ్రీహర్ష ఆట ఆడుతున్నట్లు భారత మాజీ బ్యాటర్ స్మిత హరికృష్ణ గుర్తించింది.[7] ఆమె భారతదేశం-A, భారతదేశం అండర్-21 జట్లకు ప్రాతినిధ్యం వహించింది.[8] 2015 నవంబరులో, వెస్టిండీస్‌లో పాకిస్తాన్ పర్యటన తర్వాత, [9] పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన రెండు ట్వంటీ20 మ్యాచ్‌లలో ఆడిన అమెరికన్ జట్టులో ఆమె భాగమైంది. ఈ ఫార్మాట్‌లో ఇరు జట్లు పరస్పరం తలపడడం ఇదే తొలిసారి.[10]

2019 మేలో, ఫ్లోరిడాలో జరిగే 2019 ICC ఉమెన్స్ క్వాలిఫైయర్ అమెరికాస్ టోర్నమెంట్‌కు యునైటెడ్ స్టేట్స్ స్క్వాడ్‌కు కెప్టెన్‌గా ఆమె ఎంపికైంది. క్వాలిఫైయర్‌లో గెలిస్తే జట్టు "పారవశ్యం" చెందుతుందని పేర్కొంది.[11] ఆమె 2019 మే 17 న అమెరికాస్ క్వాలిఫైయర్‌లో కెనడాపై యునైటెడ్ స్టేట్స్ తరపున WT20I లో అరంగేట్రం చేసింది [12] యునైటెడ్ స్టేట్స్ తమ మొదటి రెండు మ్యాచ్‌లలో విజయాలతో 2-0 ఆధిక్యాన్ని సాధించి అమెరికాస్ క్వాలిఫైయర్‌ను గెలుచుకుంది.[13] శ్రీహర్ష 80 పరుగులతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచింది.[14] అమెరికాస్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత శ్రీహర్ష మాట్లాడుతూ.. ‘‘అద్భుతంగా ఉంది! ఎనిమిదేళ్ల తర్వాత గ్లోబల్ క్వాలిఫైయర్‌కు వెళ్లడం యు.ఎస్.ఏ క్రికెట్‌కు భారీ విజయం." అని పేర్కొంది.[15]

2019 ఆగస్టులో, స్కాట్లాండ్‌లో జరిగే 2019 ICC మహిళల వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు ఆమె అమెరికన్ స్క్వాడ్‌కి కెప్టెన్‌గా ఎంపికైంది.[16][17] 2021 ఫిబ్రవరిలో, 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్, 2021 ICC మహిళల T20 ప్రపంచ కప్ అమెరికాస్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లకు ముందు USA క్రికెట్ ఉమెన్స్ నేషనల్ సెలెక్టర్లచే మహిళల నేషనల్ ట్రైనింగ్ గ్రూప్‌లో ఆమె పేరు పెట్టారు.[18][19] 2021 సెప్టెంబరులో, ఆమె ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం అమెరికన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.[20] 2021 అక్టోబరులో, జింబాబ్వేలో జరిగే 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం ఆమె అమెరికన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.[21]

మూలాలు

[మార్చు]
  1. "Sindhu Sriharsha". ESPN Cricinfo. Retrieved 15 May 2019.
  2. "USA-Canada to compete in pursuit of World Cup spots". ANI News. Retrieved 15 May 2019.
  3. "Sindhu Sriharsha". USA Cricket. Retrieved మార్చి 7, 2022.
  4. "Interview: USA Captain Sindhu Sriharsha – "We are eager to show what we can do!"". Cricket Her. 17 August 2017. Retrieved 15 May 2019.
  5. "EXCLUSIVE: Interview with Sindhu Sriharsha – Captain of USA Women's Cricket Team". Female Cricket. 30 August 2019. Retrieved 18 November 2019.
  6. "Sindhu Sriharsha". USA Cricket. Archived from the original on 15 మే 2019. Retrieved 15 May 2019.
  7. Upendran, Ananya (8 October 2019). "Of second comings and bravery— Sindhu Sriharsha's unconventional path to the top". Women's CricZone (in ఇంగ్లీష్). Retrieved 27 May 2022.
  8. "Gruny, Bhaskar return to USA squad after five-year absence". ESPN. 21 June 2017. Retrieved 15 May 2019.
  9. "USA Women's Squad Announced". United States of America Cricket Association. Retrieved 15 May 2019.
  10. "USACA Hosts Pakistan Women's Team for Historic Games". United States of America Cricket Association. Retrieved 15 May 2019.
  11. "United States and Canada go head to head in Women's Qualifier Americas in pursuit of World Cup spots". International Cricket Council. Retrieved 15 May 2019.
  12. "1st T20I, ICC Women's T20 World Cup Americas Region Qualifier at Lauderhill, May 17 2019". ESPN Cricinfo. Retrieved 17 May 2019.
  13. "Brilliant USA Women seal place at Global Qualifiers". USA Cricket. 18 May 2019. Retrieved 19 May 2019.
  14. "ICC Women's T20 World Cup Americas Region Qualifier, 2019: Most runs". ESPN Cricinfo. Retrieved 19 May 2019.
  15. "United States sweep Canada to reach Women's T20 and Cricket World Cup Qualifiers". International Cricket Council. Retrieved 22 May 2019.
  16. "Match official appointments and squads announced for ICC Women's T20 World Cup Qualifier 2019". International Cricket Council. Retrieved 21 August 2019.
  17. "Captains ready for Women's T20 World Cup Qualifier". International Cricket Council. Retrieved 28 August 2019.
  18. "USA Announce Women's National Training Groups". USA Cricket. February 2021. Retrieved 3 February 2021.
  19. "USA name Women's and U19 squads". Cricket Europe. Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 3 February 2021.
  20. "Team USA Women's Squad Named for ICC Americas T20 World Cup Qualifier in Mexico". USA Cricket. 16 September 2021. Retrieved 17 September 2021.
  21. "Team USA Women's Squad named for ICC Women's World Cup Qualifier in Zimbabwe". USA Cricket. 28 October 2021. Retrieved 29 October 2021.

బాహ్య లంకెలు

[మార్చు]