Coordinates: 17°44′03″N 83°19′06″E / 17.734111°N 83.318264°E / 17.734111; 83.318264

సిఎంఆర్ సెంట్రల్ (విశాఖపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిఎంఆర్ సెంట్రల్ (విశాఖపట్నం)
ప్రదేశంమద్దిలపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ రేఖాంశాలు17°44′03″N 83°19′06″E / 17.734111°N 83.318264°E / 17.734111; 83.318264
ప్రారంభ తేదీ2010 జనవరి
యజమానిసిఎంఆర్
ఫ్లోర్ల సంఖ్య6
పార్కింగ్2-స్థాయి బేస్మెంట్ పార్కింగ్

సిఎంఆర్ సెంట్రల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఉన్నా ఒక పెద్ద షాపింగ్ మాల్. మద్దిలపాలెంలో ఉన్న సిఎంఆర్ సెంట్రల్ నగరం నడిబొడ్డున ఉన్న వైజాగ్‌లోని ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటి. దీనిని సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.[1][2]

చరిత్ర[మార్చు]

విశాఖపట్నంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ సిఎంఆర్ సెంట్రల్ 6 అంతస్తుల రిటైల్ స్పేస్‌తో 2010, జనవరి 2న ప్రారంభించబడింది. ఇది మొత్తం 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 5 అంతస్తులలో విస్తరించి ఉంది. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఆహారం, ఇంటి ఫర్నిచర్ వంటి వాటితోపాటు ఇతర అన్ని ప్రధాన వస్తువులు ఈ సిఎంఆర్ సెంట్రల్ లో ఉంటాయి. ఇది ప్రధాన దుస్తులు, దుస్తులు బ్రాండ్‌ల అవుట్‌లెట్‌లు, గేమింగ్ జోన్, బౌలింగ్ అల్లే, పెద్ద సంఖ్యలో రెస్టారెంట్‌లు, నాలుగు-స్క్రీన్ మల్టీప్లెక్స్ సినిమాలను కూడా కలిగి ఉంది.[3]

వినోదం[మార్చు]

షాపింగ్ కోసం, లేదా సినిమాలు చూడటం కోసం, అనేక రకాల ఆహారాలు తినడం కోసం, సిఎంఆర్ సెంట్రల్ చాలామంది విశాఖపట్నం పౌరులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. మాల్‌లో రిలయన్స్ డిజిటల్, హోమ్‌టౌన్, స్పా, లెవిస్, మాక్స్ ఫ్యాషన్, రిలయన్స్ ట్రెండ్స్, కెఎఫ్ సీ,[4] బర్గర్ కింగ్, పిజ్జా హట్,[5] మెక్‌డొనాల్డ్స్ వంటి దుకాణాలు ఉన్నాయి.[6] ఇందులో 4 స్క్రీన్‌లు ఐనాక్స్ ఉన్నాయి. [7]

కార్యక్రమాలు[మార్చు]

నగరంలో పలు కార్యక్రమాలకు సీఎంఆర్‌ సెంట్రల్‌ వేదికగా నిలిచింది. సినిమాల విజయోత్సవ సభలు కూడా ఇందులో జరిగాయి.[8] ఈ మాల్ బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్,[9] స్వచ్చంధ కార్యక్రమాలు,[10] ఫ్యాషన్ వాక్‌లు, అందాల పోటీలు వంటి వివిధ సంగీత కార్యక్రమాలను కూడా నిర్వహించింది.[11]

మూలాలు[మార్చు]

  1. "Introduction of Mall". CMR Central.
  2. "owner of Mall". zauba corp.
  3. "McDonald's opens restaurant in Vizag". The Hindu. 2017-07-11. ISSN 0971-751X. Retrieved 2020-05-02.
  4. "KFC". kfc ndia.
  5. "pizza reasurant". pizza hut.
  6. Sarma, Ch R. S. "McDonald's enters Vizag". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2020-05-02.
  7. Bureau, Andhra Pradesh (2016-07-23). "Rajini fans swarm theatres". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-05-02.
  8. India, The Hans (2019-06-25). "Mallesham movie success meet held in Vizag". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-02.
  9. Ganguly, Nivedita (2018-07-25). "Chords by the SHORE". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-05-02.
  10. India, The Hans (2019-11-18). "270 kids take part in Children's Day fete at CMR Central in Visakhapatnam". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-02.
  11. Ganguly, Nivedita (2015-02-06). "Crown for the married". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-05-02.