సిక్కిల్ సిస్టర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిక్కిల్ సిస్టర్స్
నీల, కుంజుమణి
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలికర్ణాటక సంగీత విద్వాంసులు, వేణుగాన కళాకారులు, సంగీత ద్వయం
వాయిద్యాలువేణువు

సిక్కిల్ సిస్టర్స్గా పేరుగాంచిన సిక్కిల్ కుంజుమణి, సిక్కిల్ నీలలు కర్ణాటక సంగీత వేణుగాన విద్వాంసులు.

విశేషాలు[మార్చు]

సిక్కిల్ కుంజుమణి 1930, జూన్ 15వ తేదీన జన్మించింది. సిక్కిల్ నీల 1940, సెప్టెంబరు 6న జన్మించింది. వీరి తండ్రి నటేశ అయ్యర్ మంచి మృదంగ విద్వాంసుడు. కుంజుమణి తన మేనమామ నారాయణస్వామి అయ్యర్ వద్ద వేణువు అభ్యసించింది. నీల తన అక్కడ కుంజుమణి వద్ద వేణువును అభ్యసించింది. కుంజుమణి తన 9వ యేట, నీల తన 7వ యేట తొలిప్రదర్శనలను ఇచ్చారు. వీరిరువురూ కలిసి 1965 నుండి జంటగా దేశవిదేశాలలో వేణుగాన ప్రదర్శనలు చేసి ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఇద్దరూ ఏ గ్రేడు కళాకారులుగా ఆకాశవాణి, దూరదర్శన్‌లలో వందలాది కచేరీలు చేశారు. వీరికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారం, సంగీత నాటక అకాడమీ అవార్డు వంటి అనేక పురస్కారాలు లభించాయి. కుంజుమణి 2010, నవంబర్ 13వ తేదీన మరణించింది. నీల కుమార్తె మాలా చంద్రశేఖర్ కూడా వేణుగాన విద్యలో రాణించి తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్నది.[1]

మూలాలు[మార్చు]

  1. శంకరనారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్ట్. pp. 196, 198. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 5 March 2021.