సితార(గాయిని)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సితార కృష్ణకుమార్ (జననం 1 జూలై 1986), ప్రముఖ భారతీయ గాయిని. సితారగా ప్రసిద్ధమైన ఈమె సినీ నేపథ్య గాయినిగా ఎన్నో పాటలు పాడింది.[1] తన కెరీర్ లో అతి ఎక్కువ పాటలు మలయాళంలో  పాడగా, తమిళతెలుగుకన్నడ సినిమాల్లో కూడా పాడింది ఆమె. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలలో శిక్షణ పొందిన సితార, గజల్ గాయినిగా చాలా ప్రసిద్ధి చెందింది.[2][3] దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఆమె కొన్ని వందల స్టేజిలపై షోలు చేసింది. జానపదం[4], ఫ్యూజన్ శైలులు సితారకు చాలా ఇష్టమైనవి. కేరళలోని ప్రముఖ సంగీత బ్యాండ్లతో కలసి ఎన్నో షోలు ఇచ్చింది ఆమె. ఏస్ట్రగా అనే సంగీత బ్యాండ్ ను స్థాపించింది సితార.[5] ఈ బ్యాండ్ ద్వారా ప్రముఖ గాయకులు రిసన్, సుశాంత్, అభిజిత్, శ్రీనివాసన్, పల్సన్, తనూజ్, జితు ఓమ్మెన్ థామస్, సర్ఫార్జ్ ఖాన్ వంటి వారితో వివిధ స్టేజిలపై షోలు ఇచ్చింది ఆమె. సితార ఎక్కువగా స్త్రీ ప్రధానమైన పాటలతో మిక్స్ చేసి షోలు ఇస్తుంది. 2017లో ఎంటె ఆకాశం అనే ఆల్బంను స్వయంగా రాసి, స్వరపరచి, రికార్డు చేసింది ఆమె.[6] రాత్రి పూట పని చేసే ఉద్యోగినులపై ఈ ఆల్బంను చిత్రించింది. ఈ ఆల్బంను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తిరువనంతపురంలో కేరళ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు.

సితార

వ్యక్తిగత జీవితం[మార్చు]

కేరళలోని కోళికోడ్లో జన్మించింది సితార. ఆమె తండ్రి డాక్టర్ కె.ఎం.కృష్ణకుమార్ ప్రముఖ విద్యావేత్త. సితార తల్లి పేరు సేలీ కృష్ణకుమార్. సంప్రదాయ కళలకు చెందిన కుటుంబంలో పుట్టినా, సితార చిన్న వయసులోనే ప్రపంచ సంగీత లోకాన్ని చూసింది. ఆమె తన 4వ ఏటనే పాడటం మొదలుపెట్టింది. తెన్హిపాలంలో సెయింట్ పాల్ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించింది ఆమె.   తరువాత కాలికట్ విశ్వవిద్యాలయం క్యాంపస్ స్కూల్ లో చదువుకుంది సితార. ఫెరోక్ లోని ఫరూక్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసింది ఆమె.[7] కేరళలోని కాలికట్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది సితార. 2009 ఆగస్టు 31న గుండె వైద్య నిపుణుడు డాక్టర్ ఎం.సజిష్ ను వివాహం చేసుకుంది ఆమె. ప్రస్తుతం వారు కేరళలోని  అలువలో ఉంటున్నారు. వారిద్దరికీ 2013 జూన్ 9న ఒక పాప పుట్టింది.

మూలాలు[మార్చు]

  1. "Sithara goes to Kollywood". Times of India. 2 March 2012. Archived from the original on 2013-02-16. Retrieved 2017-05-20. More than one of |work= and |newspaper= specified (help)More than one of |work= and |newspaper= specified (help)
  2. "Beyond textbooks and classrooms". The Hindu. 20 June 2006. Archived from the original on 29 సెప్టెంబర్ 2008. Retrieved 20 మే 2017. More than one of |work= and |newspaper= specified (help); Check date values in: |archive-date= (help)More than one of |work= and |newspaper= specified (help)
  3. Yesudas to honour Pappukkutty. CNN-IBN. URL accessed on 2 April 2012.
  4. Sithara Sings a Folk Song. istream.com. URL accessed on 7 January 2013.
  5. Sithara & Eastraga. (4 April 2014).
  6. Paying tribute to the sheroes.
  7. "Providence college leading in arts festival". The Hindu. 5 March 2006. Archived from the original on 22 ఏప్రిల్ 2005. Retrieved 20 మే 2017. More than one of |work= and |newspaper= specified (help)More than one of |work= and |newspaper= specified (help)