సిద్దప్ప వరకవి
Appearance
సిద్దప్ప వరకవి (జననం: 1903, మరణం: 1984) సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, గుండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు.[1]
సూఫీ బోధనల వెలుగులో ప్రజల కోసం కవిత్వం అల్లిన తత్త్వకవుల్లో సిద్దప్ప వరకవి ఒకరు.కుమ్మరి కులానికి చెందిన ఇతను ఏడవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు.. వేమన్నను తాతగా, పొతులూరి వీరబ్రహ్మాన్ని తండ్రిగా, ఈశ్వరమ్మను అక్కగా, దూదేకుల సిద్దయ్యను అన్నగా, కాళిదాస అమరసింహులు ఆత్మబంధువులుగా వర్ణిస్తూ, వీరంతా మరణించిననూ బ్రతికియున్నవారేననీ, తాను వారి త్రోవలో సాగిపోతున్నాననీ స్పష్టపరిచాడు.సిద్దప్ప వరకవి మరణం తర్వాత ప్రజలు అతని విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. కార్తీకపున్నమి రోజు అతని శిష్యులు, విగ్రహం సాక్షిగా గురుపూజోత్సవాన్ని జరుపుతారు.25 పుస్తకాలను వెలువరించారు. సిద్దప్ప వరకవి భక్తిమార్గంలో ఉంటూనే మూఢభక్తిని నిరసించాడు.
సిద్దప్ప తత్వాలు
[మార్చు]- గొప్పవాడనను గాను, కోవిదు డనుగాను తప్పులున్నను దిద్దుడీ తండ్రులార
- ఘటము కంటెను వేరైన మఠము లేదు, ఆత్మకంటెను వేరైన హరియు లేడు
- మట్టి ఒకటె కుండలు వేరు
- బంగార మొక్కటె సొమ్ములు వేరు
- ఇనుము ఒక్కటె పనిముట్లు
- ఆయుధాలు వేరు'
- పుట్టుగొడ్డుకు పిల్లపుట్టు బాధేమెరుక
- పదిమందిని గన్న పడతికెరుక
- అయ్యవార్లకు అడవి అంత్యంబులేమెరుక
- చెలగి దిరిగెడు రామచిలుక కెరుక
- మోహమున నిండియున్న ముత్తయిదు వదియే
- మోహమిడిచనదే ముండ మూర్ఖులారా
- వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
- కనుడి కరమొప్ప కవికుప్ప కనక మప్ప'
- అజ్ఞానియే శూద్రుడవనిలో నెవడైన
- సుజ్ఞానుడే యాత్మ సుజనుడతడు
- వేదంబు జదివినా విప్రుడా విహితుండు
- బ్రహ్మమెరిగిన వాడె బ్రాహ్మణుండు
- వర్తకంబును జేయు వణిజుండు వైశ్యుండు
- అవని పాలించిన నరుడె ప్రభువు
- సకల నిందలు నోర్చు సదయిడు నరుడౌను
- మత భేద మిడిచిన యతివరుండు'
- జన్మచేతను వీరింక కలియుగమున
- పేరుగాంచిన యెవరెవరి బేర్మి పనులు
- వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
- కనుడి కరమొప్ప కవికుప్ప కనక మప్ప
- పేదలకన్నంబు పెట్ట ధైర్యము లేదు/ గట్టురాళ్ళకు తిండి బెట్టెదవు
- ఏ కులంబని నన్ను ఎరుకతో నడిగేరు
- నా కులంబును జెప్ప నాకు సిగ్గు
- తండ్రి బొందిలివాడు తల్లి దాసరి వనిత
- మా తాత మాలోడు, వినుడి
- మా యత్త మాదిగది మామ యెరుకలివాడు
- మా బావ బల్జతడు మానవతుడు
- కాపువారీ పడుచుకాంత దొమ్మరివేశ్య
- భార్యగావలె నాకు ప్రాణకాంత
పుస్తకాలు
[మార్చు]- "జ్ఞానబోధిని" నాలుగు సంపుటాలు
- "కాకి హంసోపాఖ్యానము"
- "బిక్కనవోలు కందార్థాలు"
- "గోవ్యాఘ్ర" సంభాషణలు
మూలాలు
[మార్చు]- ↑ మన తెలంగాణ, కలం (19 November 2018). "తెలంగాణ తొలి సమాజకవి.. సిద్దప్ప వరకవి రాజయోగి". అనంతవరం సిద్దిరామప్ప. Archived from the original on 19 నవంబరు 2018. Retrieved 19 November 2018.