Coordinates: 39°07′45″N 84°16′27″W / 39.129263°N 84.274102°W / 39.129263; -84.274102

సిన్సినాటి హిందూ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిన్సినాటి హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:ఒహియో
ప్రదేశం:సిన్సినాటి
అక్షాంశ రేఖాంశాలు:39°07′45″N 84°16′27″W / 39.129263°N 84.274102°W / 39.129263; -84.274102

సిన్సినాటి హిందూ దేవాలయం, అమెరికాలోని ఒహియో రాష్ట్ర రాజధాని సిన్సినాటిలో ఉన్న హిందూ దేవాలయం. సిన్సినాటి మెట్రోపాలిటన్ ఏరియాలోని హిందువులు ప్రతినిత్యం ఇక్కడికి వస్తుంటారు.[1] హిందూమత, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, వాటిని ఆచరించటం, పెంపొందించడంతోపాటు దేవాలయ భక్తులు, గ్రేటర్ సిన్సినాటి ప్రాంతంలో నివసిస్తున్న హిందూ కుటుంబాల మతపరమైన, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంకోసం ఈ దేవాలయం నిర్మించబడింది. ఇక్కడ ప్రధాన హిందూ పండుగలన్నీ జరుపబడుతాయి.

చరిత్ర[మార్చు]

సిన్సినాటిలో ఒక హిందూ దేవాలయం నిర్మించాలని అక్కడి ప్రవాస భారతీయులు నిర్ణయించుకున్నారు. అనేక సంవత్సరాల ప్రణాళిక, నిర్మాణం తర్వాత 1997, మే నెలలో ఈ దేవాలయం తెరవబడింది.[2] I-275 ఎక్స్‌ప్రెస్‌వేకి దగ్గరగా ఉన్న 100 ఎకరాల ప్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. అనేక భారతీయ వంటకాలకు పేరొందిన టేస్ట్ ఆఫ్ ఇండియా అనే ఒక కార్యక్రమం ఇక్కడ జరుపబడింది.[3][4] ఆ సమయంలో మిడ్‌వెస్ట్‌లో నిర్వహించిన అతిపెద్ద భారతీయ పండుగగా ఇది గుర్తింపు పొందింది.[5]

ప్రతిష్ఠాపన[మార్చు]

ఈ దేవాలయంలో పదహారు మంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. భారతదేశానికి చెందిన అత్యంత ప్రశంసలు పొందిన శిల్పులచే చెక్కడడిన ఒకే పరిమాణంలో, అత్యున్నత సౌందర్యం కలిగిన పన్నెండు మంది దేవతలు ఒకే వేదికపై ప్రతిష్ఠించబడ్డారు. దేవత ప్రాణ్ ప్రతిష్ట మహోత్సవం చాలా రోజులపాటు వేద మంత్రాలతో, ఏడుగురు పండిత పూజారులు, భక్తులతో జరుపబడింది. దేవాలయ విస్తరణ తరువాత మరో నాలుగురు దేవతలు ప్రతిష్ఠించబడ్డారు. దేవాలయ స్థాపనకు ముందు, భక్తులు 15 సంవత్సరాలకు పైగా ఒక చిన్న ఇంటి నేలమాళిగతో సహా వివిధ ప్రదేశాలలో పూజలు నిర్వహించారు.

సౌకర్యాలు[మార్చు]

ఈ దేవాలయంలో సాంస్కృతిక, ఇతర వేడుకల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పెద్ద హాలు, పెద్ద ప్రొఫెషనల్ కిచెన్ ఉంది. హిందూ గ్రంథాలయం, టెంపుల్ ఆఫీస్, ఒక చిన్న సమావేశ మందిరం, విశ్రాంతి గదులు ఉన్నాయి. పై అంతస్తులో దేవాలయ గిఫ్ట్స్ షాప్ కూడా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Hindu Temple of Greater Cincinnati". events.cincinnati.org. Retrieved 2022-03-06.
  2. "Cincinnati Hindu Temple Reflects Diversity Within Hinduism". Pluralism.org. 13 May 2006. Retrieved 2022-03-06.
  3. "Taste of India at The Hindu Temple of Greater Cicninnati". cincinnati.com. Retrieved 2022-03-06.
  4. "Hindu Temple of Greater Cicninnati will offer Free Taste of India Festival on September 9th". nkytribune. Retrieved 2022-03-06.
  5. "Taste of India in Clermont County". local112. Retrieved 6 February 2020.