Jump to content

సిపాయి కథలు

వికీపీడియా నుండి
సిపాయి కథలు
కృతికర్త: శిష్ట్లా ఉమామహేశ్వరరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథా సాహిత్యం
ప్రచురణ:
విడుదల:

సిపాయి కథలు ఉమామహేశ్వరరావు రచించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం, స్వయంగా తాను ఒక సైనికునిగా బ్రిటీష్ సైన్యంలో పనిచేసిన ఉమామహేశ్వరరావు స్వీయానుభవాలు, తోటి సైనుకుల జీవితగాథలు సిపాయి కథలుగా మలిచారు.

రచన నేపథ్యం

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీష్ సామ్రాజ్య సైనికునిగా పనిచేసిన శిష్ట్లా అనుభవాలు ఈ కథలకు నేపథ్యంగా అమరాయి. ఈ కథల నేపథ్యాన్ని గురించి కె.వి.రమణారెడ్డి ఇలా అంటారు. - జపాన్ సేనలు అజాద్ హిందుఫౌజును వెంటబెట్టుకుని మనదేశం మీదికి దాడి చేయనున్న తరుణం. దాన్ని తిప్పికొట్టే సన్నాహాలలో భాగంగా సైనిక శిబిరాలు నెలకొల్పుకుని, బ్రిటీష్ సామ్రాజ్య సంరక్షకులుగా మన సిపాయిలు ఎదురుచూస్తూ, తీరికగా, దాదాపు నిశ్చింతతో కాలక్షేపం చేస్తూ వచ్చిన సమయం. కాబట్టి సరదాలకూ, వినోదాలకూ పుష్కలమైన అవకాశం. దాదాపుగా అందరూ తెలుగు 'జోదు'లే.[1] ఈ నేపథ్యం శిష్ట్లా కథలకు ఒక వింత వాతావరణం, మంచి సొబగు సంపాదించిపెట్టాయనుకోవచ్చు.

ఇతివృత్తాలు

[మార్చు]

సిపాయిల జీవిత కష్టనిష్టూరాలు, సరదా సంతోషాలు ఇతివృత్తంగా స్వీకరించి కథారచన చేయడం వల్ల తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకానికి ఓ అరుదైన, విశిష్ట స్థానం లభించింది. శ్రీరంగం నారాయణబాబు నాటి ప్రముఖ సాహిత్య పత్రిక "భారతి"లో సమీక్షిస్తూ ఇదే విషయాన్ని సిపాయి కథలు "తెలుగు సాహిత్యానికి ఒక నూతన అలంకారం" అంటూ వ్యక్తీకరించారు. ఆయన ఇతివృత్తం గురించి రాస్తూ "యీ రకం కథలు ఇదివరకు తెలుగులో లేవు.ఏ దేశానికైనా యుద్ధం వస్తే, ఆ యుద్ధం నుంచి సాహిత్యంలో కొన్ని నూతన వర్గాలు రావడం యుద్ధానికుండే ఒక విశిష్టత... మన దేశంలో యుద్ధం కాలు మెట్టినా, విశాఖపట్నం, కాకినాడలు బాంబులకు ఆహుతయినా, రచయితలకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు" అంటూ రెండవ ప్రపంచ యుద్ధం తెలుగువారిపై చూపిన ప్రభావం చిత్రించిన సిపాయి కథల విశిష్టతను తెలిపారు.[2]

కథనం

[మార్చు]

శైలి,ఉదాహరణలు

[మార్చు]

ఈ కథల్లో 1940వ దశకం చివరినాటికి కొత్తగా ప్రయోగానికి వస్తున్న వ్యావహారికంలోనూ మరింత ప్రయోగాత్మకమైన అచ్చ గ్రామీణుల భాషను ఉపయోగించారు. ఈ క్రమంలో కూడా ఈ కథలు తమ ప్రత్యేకతను, విలక్షణతను నిలబెట్టుకున్నాయి. గురజాడ తప్ప ఇతర వ్యవహారిక భాషోద్యమ రచయితలు క్రియా శబ్దాలు తప్ప దాదాపు అభినవ గ్రాంథికశైలినే ప్రయోగంలో ఉపయోగించుకున్నా చాసో, గోఖలే వంటివారితో పాటు మాండలిక ప్రయోగాల విషయంలో తన స్వంత ప్రయోగాలతో తెలుగు వాడుకభాష అభివృద్ధిలో పాలుపంచుకున్నారు.

ఇతరుల మాటలు

[మార్చు]
  1. ఇందులో రచయిత కడునేర్పుతో, సిపాయీల దైనందిన జీవిత రసవ ద్ఘట్టాలను ఎంతో ప్రతిభతో రచించారు -శ్రీరంగం నారాయణబాబు

మూలాలు

[మార్చు]
  1. తొలి ప్రచురణకు కె.వి.రమణారెడ్డి రాసిన ముందుమాట "విలక్షణమైన కథలు"(రచనా కాలం 31-8-1983)
  2. భారతి(1946 జూన్)లో శ్రీరంగం నారాయణబాబు సమీక్ష

ఇవి కూడా చూడండి

[మార్చు]