Jump to content

సిలికోసిస్

వికీపీడియా నుండి

సిలికోసిస్ (Silicosis) ఒక రకమైన వృత్తి సంబంధ శ్వాసకోశ వ్యాధి. ఇది సిలికా ధూళి పీల్చడం వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో ఊపిరితిత్తులు వాచి గట్టిపడతాయి.

సిలికోసిస్ అకస్మాత్తుగా వచ్చినప్పుడు న్యుమోనియా వలె ఆయాసం, జ్వరం, శరీరం నీలంగా మారడం జరుగుతుంది.

ఈ వ్యాధిని మొదటిసారిగా రమజిని 1705 సంవత్సరం రాతి పనివాళ్ళలో గుర్తించాడు. సిలికోసిస్ అని పేరు పెట్టింది (లాటిన్ silex లేదా flint) 1870లో విస్కోంటి.

చరిత్ర

సిలికోసిస్ అనేది దీర్ఘకాలిక ఊ పిరితిత్తుల వ్యాధి. ఇది సిలికా ధూళిని పీల్చడం వల్ల వస్తుంది,సిలికా అనేది సహజంగా కొన్ని రకాల రాయి, రాతి, ఇసుక, బంకమట్టిలో లభిస్తుంది. ఈ పదార్థాలతో పనిచేయడం వల్ల చాలా దుమ్ము ఏర్పడుతుంది. ఈ దుమ్మును తొందరగా పీల్చుకోవచ్చు . సిలికోసిస్ రాతి ( రాళ్ళలో ) లో గృహ నిర్మాణాల, కాంక్రీట్ పనివారలకు , సెరామిక్స్ పరిశ్రమలు , గాజుల పరిశ్రమలు , మైనింగ్ , క్వారీ , ఇసుక పారిశ్రామికులకు వీళ్ళ అందరికి సిలికోసిస్ వ్యాధి వస్తుంది . ఈ వ్యాధి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, 10-20 సంవత్సరాలు సిలికాకు గురైన తర్వాత వ్యాధి బారిన పడుతారు . అయితే ఇది 5-10 సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు వ్యాధి బయట పడవచ్చును .

[మార్చు]

లక్షణాలు

[మార్చు]

నిరంతర దగ్గు,శ్వాస ఆడకపోవడం,బలహీనత , అలసట , కొంతమంది చివరికి నడవడం లేదా మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది . ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం మానేస్తే (శ్వాసకోశ వైఫల్యం) చివరికి ప్రాణాంతకం కావచ్చు [1]

చికిత్స

[మార్చు]

సిలికోసిస్ కోసం నిర్దిష్ట పరీక్ష లేదు, రోగనిర్ధారణ చేయడానికి వైద్యులు మన ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని అంటే విశ్రాంతి సమయంలో, వ్యాయామం చేసేటప్పుడు శ్వాస గురించి అడుగుతారు. రోగి పనిచేసిన సమయములో తీసుకున్న జాగ్రత్తలు , ధూమపాన అలవాటు ఉన్నదా లేదా రోగి నుంచి వైద్యులు తెలుసుకుంటారు ఛాతీ ఏక్స్ రే పరీక్ష, సిటి స్కాన్ పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల గురించి తెల్సుకొని సిలికాద్వారా వారు ఎంత నష్టం జరిగిందో తెలుసుకుంటారు . ఊపిరి తిత్తుల పరిక్ష ద్వారా రక్తం లో ఆక్సిజన్ సామర్థ్యాన్ని తెలుకోవడం , కఫం ద్వారా తెలుసుకోవడం , బ్రోంకోస్కోపీ ద్వారా ఊపిరి తిత్తుల పరీక్ష ద్వారా కణజాల నమూనా సేకరించడం, బయాప్సీ ద్వారా ఊపిరితిత్తుల కణజాల నమూనాను పొందడం వంటి పరీక్షల ద్వారా సిలికోసిస్ వ్యాధిని పరిశీలిస్తారు [2] ప్రస్తుతం సిలికోసిస్‌కు చికిత్స లేదు.ఊపిరి పీల్చే స్టెరాయిడ్లు ద్వారా ఊపిరితిత్తుల శ్లేష్మాన్ని తగ్గించడం , బ్రోంకోడైలేటర్లు శ్వాస భాగాలను సడలించడానికి సహాయపడతాయి, ఊపిరి తిత్తుల మార్పిడి చికిత్స, పొగ త్రాగడం మాని పించడం వంటివి వైద్యులు చేస్తారు [3]

నివారణ
[మార్చు]

సిలికోసిస్ నివారించదగినది, సిలికా దుమ్ముతో బయటపడే ఉద్యోగంలో పనిచేస్తుంటే రక్షించుకోవడానికి అవసరమైన దుస్తులను వేసుకోవాలి.వీలైనప్పుడల్లా దుమ్ముతో పనిచేయడం మానుకోవడం , పనిలో మురికిగా ఉన్న ప్రదేశాలలో పొగాకు ఉత్పత్తులను తినకూడదు, త్రాగకూడదు, శుభ్రమైన దుస్తులను ధరించడం వంటివి ప్రజలు తీసుకోవాలి [4]


The full name for this disease when caused by the specific exposure to fine silica dust found in volcanoes is pneumonoultramicroscopicsilicovolcanoconiosis, and at 45 letters it is the longest word in any of the major English dictionaries. (The name has been described as a "trophy word"—its only job is to serve as the longest word.[5])

మూలాలు

[మార్చు]
  1. "Silicosis". nhs.uk (in ఇంగ్లీష్). 2017-10-19. Retrieved 2020-11-23.
  2. "Silicosis Symptoms, Causes, and Risk Factors". www.lung.org (in ఇంగ్లీష్). Retrieved 2020-11-23.
  3. "Silicosis: Symptoms, Causes, Diagnosis, Treatment, Prevention". WebMD (in ఇంగ్లీష్). Retrieved 2020-11-23.
  4. "Silicosis". foundation.chestnet.org (in ఇంగ్లీష్). Retrieved 2020-11-23.
  5. ""A Word A Day" comment on the longest "official" word". Archived from the original on 2008-05-09. Retrieved 2008-05-13.