సి.వి.కె. రావు
Appearance
(సి. వి. కె. రావ్ ఆత్మకథ నుండి దారిమార్పు చెందింది)
సి. వి. కృష్ణారావు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈయన ఆత్మకథ, "సి.వి.కె.రావు గారి ఆత్మకథ" ప్రథమ భాగాన్ని 1994 సంవత్సరంలో ప్రజా పురోగామి ఉద్యమ ప్రచురణగా ముద్రించారు.
సి. వి. కె. రావు 1912లో కాకినాడలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి సి.రాజు. కాకినాడలో వివిధ పాఠశాలలో చదివి, ఉన్నత పాఠశాల సామర్లకోటలో పూర్తిచేసి, తిరిగి కాకినాడలో కళాశాల చదువులు కొనసాగించాడు. 18 సంవత్సరాల వయసులో 14 ఏళ్ల మాణిక్యాంబతో వివాహం జరిగింది.