సి. వి. రంగనాథ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలమూర్ వీరవల్లి రంగనాథ శాస్త్రి
సి.వి.రంగనాథ శాస్త్రి చిత్రం
జననం1819
ఉత్తర ఆర్కాట్ ,
మద్రాసు ప్రెసిడెన్సీ
మరణం5 జూలై 1881
మద్రాసు
వృత్తిసివిల్ సర్వంట్, జడ్జి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బహుభాషా కోవిదుడు, పండితుడు

కాలమూరు వీరవల్లి రంగనాథ శాస్త్రి (c. 1819 – 5 జూలై 1881) ఒక భారతీయ వ్యాఖ్యాత, పౌర సేవకుడు, బహుభాషా కోవిదుడు, సంస్కృత పండితుడు. అతను భారతీయ, విదేశీ భాషలపై ప్రావీణ్యం సంపాదించాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

రంగనాథ శాస్త్రి 1819 వ సంవత్సరంలో అప్పటి ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని చిత్తూరు సమీపంలోని ఒక గ్రామం లో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు[1]. అతని తండ్రి ఆనాటి గొప్ప సంస్కృత పండితులలో ఒకరిగా పేరు పొందాడు. కాని మొదట్లో అతనికి విద్యాభ్యాసం చేయలేకపోయాడు. రంగనాథ శాస్త్రి ఇంట్లో విద్యను ప్రారంభించాడు. ఎనిమిది సంవత్సరాల వయస్సులో అతను సంస్కృతంలో ప్రావీణ్యం పొందాడు. తాను పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు భూమి అద్దె చెల్లించనందుకు తన తండ్రిని అరెస్టు చేయడంతో శాస్త్రి జీవితంలో ఒక మలుపు తిరిగింది. తన తండ్రి తరపున తాను పూచీకత్తుగా పేర్కొంటూ వార్షిక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి తన తండ్రిని జైలు నుండి తాత్కాలికంగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ శాస్త్రి జిల్లా న్యాయమూర్తి కాసామజోర్ ముందు విజ్ఞప్తి చేశాడు. చలించిన కాసామజోర్ శాస్త్రి తండ్రిని విడుదల చేయడమే కాక అబ్బాయికి విద్యను అందించడానికి ప్రయత్నించాడు.

రంగనాథ శాస్త్రిని మొదట కాసామజోర్, చిత్తూరు మిషనరీ హెచ్. గ్రోవ్స్ లు ప్రైవేటుగా బోధించారు. ఆరు నెలల్లో శాస్త్రి ఇంగ్లీష్ చదవడం, వ్రాయడం చేయగలిగాడు. గ్రోవ్స్ వద్ద విద్యార్జన సమయంలో శాస్త్రి గణితంలో ఆసక్తిని కనబరిచాడు. త్వరలోనే ఖగోళ శాస్త్ర అధ్యయనానికి ముందుకు వచ్చాడు. శాస్త్రి అధ్యయనం కోసం కాసామజోర్ తన తల్లిదండ్రులను చాలా కష్టంతో ఒప్పించిన తరువాత 1836 లో శాస్త్రీని మద్రాసుకు పంపాడు. రంగనాథ శాస్త్రి 1836 నుండి 1839 వరకు బిషప్ కొర్రీ యొక్క గ్రామర్ పాఠశాలలో, 1839 నుండి 1842 వరకు హై స్కూల్ (తరువాత, ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాస్) లో చదువుకున్నాడు. 1842 లో ఆనర్స్‌ తో పట్టభద్రుడయ్యాడు.

ప్రారంభ ఉద్యోగ జీవితం[మార్చు]

గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బోధించాలనుకున్నాడు. కానీ ప్రభుత్వం ప్రతికూల వైఖరి, అతని తండ్రి అనారోగ్యం వల్ల రంగనాథ శాస్త్రి చిత్తూరుకు వచ్చాడు. అక్కడ సబార్డినేట్ జడ్జి కోర్టులో గుమస్తాగా రూ. 70. జీతంతో చేరాడు. ఈ సమయంలో శాస్త్రి భాషల పట్ల తన అరుదైన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. త్వరలో తెలుగు, హిందూస్థానీ, పెర్షియన్, కన్నడలలో ప్రావీణ్యం పొందాడు. తన తండ్రి వెంటనే మరణించిన తరువాత అతను మద్రాసులోని సుప్రీంకోర్టులో దుబాసీగా ఉద్యోగం సంపాదించడానికి భారతీయ భాషలపై తన నైపుణ్యాన్ని ఉపయోగించాడు. దుబాసీగా పనిచేస్తున్నప్పుడు, శాస్త్రి ఫ్రెంచ్, లాటిన్ వంటి యూరోపియన్ భాషలను కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు. శాస్త్రి త్వరలోనే నెలకు రూ. 2,000 - 2,500 జీతంతో ప్రధాన దుబాసీగా పని చేసేవాడు. 1857 లో మద్రాస్ విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు రంగనాథ శాస్త్రిని విశ్వవిద్యాలయంలో ఫెలోగా చేసారు.

తర్వాత ఉద్యోగ జీవితం[మార్చు]

ఏప్రిల్ 1859 లో స్మాల్ క్లెయిమ్స్ కోర్ట్ బెంచ్‌ లో ఉద్యోగం ఖాళీగా ఉంది. రంగనాథ శాస్త్రిని అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ చార్లెస్ ట్రెవిలియన్ భారీ వ్యతిరేకత, జాతి వివక్షను ఎదుర్కొన్న తరువాత ఈ పదవికి నియమించాడు. రంగనాథ శాస్త్రి ఏప్రిల్ 1859 నుండి 1880 ఫిబ్రవరి 16 న పదవీ విరమణ చేసే వరకు చిన్న దావా కోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు.

పదవీ విరమణ చేసిన వెంటనే రంగనాథ శాస్త్రి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నామినేట్ అయ్యాడు. అయినప్పటికీ, అతను 1881 జూలై 5 న మరణించాడు.

కుటుంబం, వారసులు[మార్చు]

రంగనాథ శాస్త్రి కుమారుడు కాలమూర్ సుందర శాస్త్రికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతని పెద్ద కుమారుడు సర్ సి. వి. కుమారస్వామి శాస్త్రి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. అతని కుమార్తె సీతమ్మల్ 20 వ శతాబ్దం ప్రారంభంలో మద్రాసులో రాజకీయ నాయకుడైన సర్ సి. పి. రామస్వామి అయ్యర్‌ను వివాహం చేసుకుంది.

మూలాలు[మార్చు]

  1. Buckland, Charles Edward (1906). Dictionary of Indian biography. London: Swan Sonnnenschein & CO. pp. 375.

ఇతర లింకులు[మార్చు]