సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండంలోని రాళ్లపాడు వద్ద నిర్మించనున్నారు. దీన్ని 2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 50 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.[1] 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్ముస్తున్నారు. ఈ పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనునుంది. [2]

అనుమతులు[మార్చు]

సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్ 1కు కేంద్ర‌ అటవీ శాఖ‌ అనుమతులు లభించాయి. 3781 ఎకరాల అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులు కూడా వ‌చ్చాయి. భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్త గూడెం అటవీ డివిజన్లలోని 1201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్ లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు చెన్నైలోని అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసారు. ప్రాజెక్టులోని పైపు లైన్లు, గ్రావిటీ కేనాల్స్, కేనాల్స్ పై స్ట్ర‌క్చర్లు, విద్యుత్ లైన్లు, టన్నెల్స్ నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమవుతున్నాయి.[2]

మూలాలు[మార్చు]

  1. సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  2. 2.0 2.1 "ప్రతిష్ఠాత్మక సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్-1 కు కేంద్ర అటవీ శాఖ అనుమతులు." ap7am.com. Retrieved 2020-05-21.[permanent dead link]