Jump to content

సీత జోస్యం

వికీపీడియా నుండి

నార్ల వెంకటేశ్వరరావు రెండు రామాయణ నాటకాలు రాశాడు. ఒకటి జాబాలి (1974), మరొకటి సీత జోస్యం (1979). ఈ రచనకు నార్ల వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

కథా సంగ్రహం

[మార్చు]

దీని పీఠికలో “రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు వీటన్నిటి ముఖ్య ధ్యేయం వర్ణ ధర్మ పరిరక్షణ. రాచరిక వ్యవస్థ రక్షణ." అంటాడు నార్ల: దీన్లో దండకారణ్యంలో ఋషులూ రాక్షసుల మధ్య ఘర్షణని ఆహారం ఉత్పత్తిచేసేవారికీ ఆహారం పోగుచేసేవారికీ మధ్య సంఘర్షణగా పోల్చి చిత్రిస్తాడు. రఘువంశానికే గొప్ప యుద్ధవీరుడని ఋషులు తనని పొగిడితే దాంతో ఉబ్బిపోయి రాక్షసుల్ని చంపే అహంభావిగా రాముణ్ణి చిత్రిస్తాడు. అడవుల్ని నాశనం చేస్తున్న ఋషుల వల్ల రాక్షసుల భుక్తికి ప్రమాదం కలుగుతున్నదని సీత సత్యం గ్రహిస్తుంది. రాక్షసులు తిరగబడతారనీ, వాళ్ళ మానాన వాళ్ళను వదిలెయ్యమనీ సీత రాముణ్ణి కోరుతుంది. దక్షిణ ప్రాంత భూముల్ని ఆక్రమించటానికి ఇది ఋషులు వేసిన పథకం అని వివరిస్తుంది. కాని అతను వినడు. ఫలితం ఏమన్నా కానీ, బ్రాహ్మణులని కాపాడతానని మాట ఇచ్చానంటాడు. ఒకనాటికి ఆ బ్రాహ్మణుల్ని మెప్పించటానికి తనను కూడ వదులుకుంటాడని సీత జోస్యం చెప్పటంతో నాటకం ముగుస్తుంది!

మూలాలు

[మార్చు]