Jump to content

సీత రాముని కోసం

వికీపీడియా నుండి
సీత రాముని కోసం
దర్శకత్వంరోహిన్ వెంకటేశన్
నిర్మాతశరత్ శ్రీరంగం, సరిత గోపిరెడ్డి
తారాగణంశిల్ప శ్రీరంగం, కారుణ్య చౌదరి
ఛాయాగ్రహణంజయపాల్ రెడ్డి
కూర్పుసాయి తలారి
సంగీతంఅనిల్ గోపిరెడ్డి
నిర్మాణ
సంస్థలు
తన్మయ్ చిన్నయ ప్రొడక్షన్స్, రోల్ కెమెరా యాక్షన్
విడుదల తేదీ
15 డిసెంబర్ 2017 [1]
సినిమా నిడివి
119 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

సీత రాముని కోసం 2017లో విడుదలైన తెలుగు సినిమా. తెలుగు టివి సమర్పణలో తన్మయ్ చిన్నయ ప్రొడక్షన్స్, రోల్ కెమెరా యాక్షన్ బ్యానర్‌లపై శరత్ శ్రీరంగం, సరిత గోపిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ గోపిరెడ్డి దర్శకత్వం వహించాడు. శరత్ శ్రీరంగం, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 15 డిసెంబర్ 2017న విడుదలైంది.[2]

అమెరికాలో ఉండే సైకాలజిస్ట్ పని చేసే విక్రాంత్ (శరత్ శ్రీరంగం) హైదరాబాద్ లో తన అక్క కోసం ఓ విల్లాను కొనుగోలు చేస్తాడు, కానీ ఆ విల్లాలో ఆత్మలున్నాయని తెలిసి హైదరాబాద్ వచ్చి వాటి గురించి పరిశోధించి వాటిని పరిష్కరించాలనుకుంటాడు. అలా ఆ ఇంట్లోకి వెళ్లిన విక్రాంత్ కి సీత (కారుణ్య చౌదరి) ఆమె కూతురు అంజలిలు ఆత్మలు ఎదురవుతాయి. అసలు ఆ ఆత్మలు అక్కడెందుకున్నాయి, విక్రాంత్ ఆ ఆత్మలకు ఎలా విముక్తి కలిగించాడు అనేదే ఈ మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: తన్మయ్ చిన్నయ ప్రొడక్షన్స్, రోల్ కెమెరా యాక్షన్
  • నిర్మాతలు: శిల్పా శ్రీరంగం, సరిత గోపిరెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి
  • సంగీతం: అనిల్ గోపిరెడ్డి
  • సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి
  • మాటలు: వేణు రాచర్ల
  • ఎడిటర్: సాయి తలారి
  • పాటలు: భాస్కరభట్ల, వెంగి

మూలాలు

[మార్చు]
  1. The Hans India (9 December 2017). "'Seetha Ramuni Kosam' to hit screens on Dec 15" (in ఇంగ్లీష్). Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  2. The Times of India (15 December 2017). "Seetha Ramuni Kosam Movie". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  3. Sakshi (15 December 2017). "'సీత రాముని కోసం' మూవీ రివ్యూ". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  4. Mana Telangana (6 December 2017). "నేనెంతో ఇష్టపడి మనసుపెట్టి చేశా". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.