సీవీ ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌

సీవీ ఆనంద్‌

ఐపీఎస్ అధికారి
జననం1969
బంధువులుడా. లలితా (భార్య) మిలింద్, నిఖిల్ (కుమారులు) [1]
Police career
విభాగముఇండియన్ పోలీస్ సర్వీస్ (1991)
దేశంతెలంగాణ క్యాడర్
Years of service1991 - ప్రస్తుతం
Rankఅడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌

సీవీ ఆనంద్‌ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి & మాజీ క్రికెట్ క్రీడాకారుడు.[2] సీవీ ఆనంద్‌ 24 డిసెంబర్ 2021[3] నుండి 12 అక్టోబర్ 2023 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించాడు.[4]

ఆయన 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా,[5] 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి అందుకున్నాడు.[6] అడిషనల్‌ డీజీగా ఉన్నా సీవీ ఆనంద్‌ కు డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్ట్‌ 07న ఉత్తర్వులు జారీ చేసింది.[7]

తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల విధుల నిర్వహణ నుంచి ఆయనను 12 అక్టోబర్ 2023న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పించారు.[8]

నిర్వహించిన భాద్యతలు

[మార్చు]
  • వరంగల్ ఏఎస్పీ
  • అడిషనల్ ఎస్పీ - ఆదిలాబాద్
  • ఎస్పీ - నిజామాబాదు
  • హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ
  • సి.ఐ.డి - డి.ఐ.జి
  • ఎక్సైజ్ & ప్రొహిబిషన్ డైరెక్టర్
  • విజయవాడ పోలీస్ కమీషనర్
  • హైదరాబాద్ ట్రాఫిక్ కమీషనర్
  • సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ (2013 - 2016)
  • పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ (2016 - 2018)
  • జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ (నిసా) డైరెక్టర్‌ ( ఫిబ్రవరి 16, 2018 - 24 డిసెంబర్ 2021)[9][10]
  • హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ (25 డిసెంబర్ 2021 - 2023 ) [11]
  • ఏసీబీ డైరెక్టర్‌ & విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ
  • హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ (7 సెప్టెంబర్ 2024 - ప్రస్తుతం)[12]

పురస్కారాలు

[మార్చు]
  • 2002 రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్
  • 2008 వృత్తిలో చేసిన విశిష్ట సేవలకుగాను ఇండియన్ పోలీస్ మెడల్
  • 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆయన పని చేస్తున్న సమయంలో పోలీస్ శాఖ ఎన్నికల విధుల్లో పాల్గొన్ని తమ పనులను సమర్ధవంతంగా నిర్వహించినందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం నుండి అవార్డును అందుకున్నాడు.[13]
  • 2017 రాష్ట్రపతి పోలీసు పతకం
  • తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డు - 2017 (కమిషనర్‌గా పౌరసరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలకు, పనితీరు) [14]
  • రాజస్థాన్ ప్రభుత్వ ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా చేపట్టిన వినూత్న పద్ధతులకు గాను (అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం) ఆయన 2017 మార్చి 3న జైపూర్‌లో జరిగిన ఈ - ఇండియా ఇన్నోవేటివ్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.

క్రీడ జీవితం

[మార్చు]

సీవీ ఆనంద్‌ 1986లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత అండర్ - 19 టీం జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన హైదరాబాద్ అండర్ - 19 & 22 జట్టులో ఆడాడు. సీవీ ఆనంద్‌ 45 కేటగిరి టెన్నిస్ లో అల్ ఇండియా పోలీస్ టెన్నిస్  ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నాడు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథెటిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ ను గెలిచాడు. [15]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (8 December 2016). "Papa don't preach" (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  2. C.V.ANAND (2021). "C.V.ANAND". cvanandips.blogspot.com. Retrieved 7 September 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (24 December 2021). "హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్‌ల బదిలీ". Archived from the original on 24 December 2021. Retrieved 26 December 2021.
  4. V6 Velugu (12 October 2023). "20 మంది ఆఫీసర్లపై..బదిలీ వేటు". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (18 May 2016). "అడిషనల్ డీజీగా సీవీ ఆనంద్". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  6. Namasthe Telangana (20 August 2021). "సీవీ ఆనంద్‌, జితేందర్‌లకు కేంద్రంలో ఏడీజీ హోదా". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  7. Eenadu (8 August 2023). "సీవీ ఆనంద్‌ సహా ముగ్గురికి డీజీలుగా పదోన్నతి". Archived from the original on 8 August 2023. Retrieved 8 August 2023.
  8. Prajasakti (14 October 2023). "తెలంగాణలో కలెక్టర్లు, ఎస్‌పిలపై బదిలీ వేటు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  9. Vaartha (16 February 2018). "సిఐఎస్ఎఫ్ ఐజీగా సివి ఆనంద్‌". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  10. Deccan Chronicle (11 August 2020). "C V Anand, the new director of National Industrial Safety Academy" (in ఇంగ్లీష్). Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.
  11. Eenadu (24 December 2021). "హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా సీవీ ఆనంద్‌". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  12. V6 Velugu (7 September 2024). "రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‎ల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‎గా సీవీ ఆనంద్". Retrieved 7 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Deccan Chronicle (22 January 2015). "Prestigious award for Cyberabad Police Commissioner C V Anand for poll role" (in ఇంగ్లీష్). Archived from the original on 15 September 2015. Retrieved 7 September 2021.
  14. Andrajyothy (12 November 2017). "పౌరసరఫరాలో పోలీస్‌ మార్క్‌". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  15. Deccan Chronicle (23 December 2016). "Ton of joy for C V Anand" (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.