Jump to content

సీషెల్స్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
సీషెల్స్‌ రాజధాని విక్టోరియా లోని హిందూ దేవాలయం

సీషెల్స్‌లో హిందూమతం, క్రైస్తవం తర్వాత రెండవ అతిపెద్ద మతం. జనాభాలో హిందువులు 2.4% పైబడి ఉన్నారు. [1] సీషెల్స్ హిందూ కోవిల్ సంగం సంస్థ వలన, నవశక్తి వినాయగర్ ఆలయం కారణంగా సీషెల్స్‌లో హిందూమతం వ్యాప్తి చెందుతోంది. హిందూమతం పరిమాణం, ప్రజాదరణ పెరగడం వల్ల ప్రభుత్వం తైపూసం కావడి పండుగను సెలవు దినంగా ప్రకటించింది.

సీషెల్స్ జనాభాలో 6% మంది భారతీయులు. అయితే హిందువులు 2.4% మాత్రమే

సీషెల్స్‌లోని హిందువుల చరిత్ర

[మార్చు]

1901 నాటి దేశ జనాభా 19,237 లో 332 హిందూ కుటుంబాలుండేవి. దాదాపు 3,500 మంది తమిళం మాట్లాడే ప్రజలు ఉండేవారు.

1984లో సీషెల్స్ హిందూ కోవిల్ సంగమం నిర్వహించడం, 1992 మేలో నవశక్తి వినాయగర్ ఆలయాన్ని ప్రతిష్టించడంతో మతపరమైన మేల్కొలుపు జరిగి భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల పునరుజ్జీవనానికి కారణమైంది. [2]

జనాభా శాస్త్రం

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
1987506—    
1994953+88.3%
20021,700+78.4%
20102,174+27.9%
సంవత్సరం శాతం మార్పు
1994 1.3% -
2002 2.1% 0.8%
2011 2.4% 0.3%

2010 జనాభా లెక్కల ప్రకారం, సీషెల్స్‌ జనాభాలో 2.4% మంది హిందువులు (2,174 మంది) ఉన్నారు. [3] ఇది 2002 జనాభా లెక్కలతో పోలిస్తే 470 మంది పెరిగారు. ఇందులో 1,700 మంది హిందువులు (2.1%). 1994లో 953 మంది హిందువులు (1.3%) మంది ఉన్నారు. [4]

సీషెల్స్ హిందూ కోవిల్ సంగం

[మార్చు]

సీషెల్స్ హిందూ కోవిల్ సంగం, పదిహేడేళ్ల స్వల్ప వ్యవధిలో, హిందూ సంస్కృతిని పరిరక్షించడం, ఏకీకరణ చేయడం, మరింతగా విస్తరించడం కోసం కొన్ని బలమైన పునాదులు వేసింది. జనాదరణ పొందిన కావడి పండుగ, ప్రత్యేక హిందూ పండుగలు జాతీయ మీడియాలో తమిళం, ఇంగ్లీషుల్లో ప్రసారమయ్యాయి.

అరుల్మిగు నవశక్తి వినాయగర్ ఆలయం

[మార్చు]

అరుల్మిగు నవశక్తి వినాయగర్ ఆలయం సీషెల్స్‌లోని ఏకైక హిందూ దేవాలయం. ఇది వినాయకుని గుడి. ప్రధాన దేవతతో పాటు, మురుగన్, నడరాజు, దుర్గ, శ్రీనివాస పెరుమాళ్, భైరవ, చండీకేశ్వరుల విగ్రహాలను ఆలయం లోపలి మండపంలో ప్రతిష్టించారు. ప్రత్యేక సందర్భాలలో వివిధ దేవతలకు ప్రార్థనలు నిర్వహిస్తారు.

1993లో ఆలయం లోపలి ప్రాంగణంలో ప్రారంభమైన తైపూసం కావడి ఉత్సవాన్ని ఇప్పుడు బయటి ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. రథ కావడిని కూడా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ పండుగ జాతీయ పండుగగా ప్రజాదరణ పొందింది. 1998 నుండి ఈ రోజును ప్రభుత్వం హిందువులకు సెలవు దినంగా ప్రకటించింది. [5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Seychelles". CIA – The World Factbook.
  2. Vijaratnam Śivasupramaniam. "Taippoosam Kavadi Festival in Seychelles". murugan.org.
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2014-05-14. Retrieved 2013-11-12.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Housing and Population Census 2002" (PDF). Retrieved 14 August 2020.
  5. Vijaratnam Śivasupramaniam. "Taippoosam Kavadi Festival in Seychelles". murugan.org.