సీసా (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీసా
సీసా తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంమహ్మద్ ఇస్సాక్
రచనమహ్మద్ ఇస్సాక్
నిర్మాతరాజశేఖర్ నల్లూరి
మహ్మద్ ఇస్సాక్
ఎండి రజియా బీ
తారాగణంశివాజీ
చేస్వా
నర్మత
ఛాయాగ్రహణంఈ.జె. నౌజాద్
సంగీతంకె. భాస్కర్
విడుదల తేదీ
మార్చి 18, 2016
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సీసా 2016, మార్చి 18న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం. మహ్మద్ ఇస్సాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, చేస్వా, నర్మత నటించగా, కె. భాస్కర్ సంగీతం అందించాడు.[1] తమిళ మాతృక అగాడమ్ సినిమా మాదిరిగానే ఈ చిత్రం కూడా సింగిల్ టేక్ లో చిత్రీకరించబడింది.[2]

కథా సారాంశం[మార్చు]

ఇది మానవ భావోద్వేగాలకు సంబంధించిన థ్రిల్లర్ చిత్రం. సీసాలో ఉన్న దెయ్యం తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందించబడింది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: మహ్మద్ ఇస్సాక్
  • నిర్మాత: రాజశేఖర్ నల్లూరి, మహ్మద్ ఇస్సాక్, ఎండి రజియా బీ
  • రచన: మహ్మద్ ఇస్సాక్
  • సంగీతం: కె. భాస్కర్
  • ఛాయాగ్రహణం: ఈ.జె. నౌజాద్

రిమేక్[మార్చు]

తమిళ చిత్రం అగాడమ్ సినిమా ఆధారంగా సీసా చిత్రం రూపొందించబడింది. అగాడమ్ 2 గంటల 3 నిమిషాల 30 సెకన్లపాలు సింగిల్ షాట్‌లో చిత్రీకరించబడి ప్రపంచ సినిమా చరిత్రలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌గా నిలిచింది. రష్యన్ ఆర్క్ సినిమా 96 నిమిషాల స్టెడికామ్ సీక్వెన్స్ షాట్‌తో ఉన్న రికార్డును దాటి ఈ చిత్రం రికార్డులో నిలిచింది.[3][4]

విడుదల[మార్చు]

2016, మార్చి 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదలయింది.

మూలాలు[మార్చు]

  1. "Seesa Movie Review". Indiaglitz. 16 March 2016. Retrieved 5 February 2020.
  2. "Whole film shot in one take!". India Glitz. 12 March 2016. Retrieved 5 February 2020.
  3. "Festival de Cannes: Russian Ark". festival-cannes.com. Archived from the original on 22 ఆగస్టు 2011. Retrieved 5 February 2020.
  4. "Sivaji Has A Highly Demanding Role In Seesa". oneindia. 17 Aug 2013. Archived from the original on 21 ఆగస్టు 2013. Retrieved 5 February 2020.

ఇతర లంకెలు[మార్చు]