సీస్తాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోజ్దార్ ద్వారం, సీస్తాన్

Sīstān ( పర్షియన్ - سیستان), లేదా సాకస్తాన్, నవీన తూర్పు ఇరాన్ (సీస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతం), దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ (నిమ్రూజ్, కాందహార్, జబూల్ ప్రాంతాలు), బలూచిస్తాన్కు చెందినా నొక్ కుండి లకు చెందిన ఒక చారిత్రాత్మక ప్రాంతం.

సీస్తాన్ విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సూఫీ తరీకాలకు, సాహితీ సంస్కృతులకు నెలవు. ఇస్లామీయ గ్రంధాలలోని హదీసులలో ఒకటైన సునన్ అబూ దావూద్ యొక్క క్రోడీకరణ కర్త అయిన అబూ దావూద్ (అబూ దావూద్ సులేమాన్ ఇబ్న్ అల్-అషాస్ అల్-అజ్ది అస్-సీస్తాని (Abu Dawud Sulaymān ibn al-Ashʿath al-Azdi as-Sijistani) ( أبو داود سليمان بن الأشعث الأزدي السجستاني), ) సీస్తాన్ కు చెందిన వాడే.

పద వ్యుత్పత్తి[మార్చు]

సీస్తాన్ అనే పదము సాకస్తాన్ నుండి ఉద్భవించినది, ఈ పేరు, సాకా తెగల (బహుశా "శాక" కావచ్చు) ప్రాంతంగా పరిచితం. సాక (గ్రీకులకు సితియన్లు గా పరిచయం) తెగలు పార్థియన్ ల కాలములో ఇక్కడ స్థిరబడ్డాయి.

ఇంకనూ ప్రాచీన కాలంలోని ప్రాచీన పర్షియా సాకా ప్రాంతం "జరాంకా" (నీటి-ప్రాంతం పష్టూ భాష ద్జరాన్డా). ఈ ప్రాచీన పేరుకు మూలాలు గల పేరు జరాన్జ్, ఆఫ్ఘన్ ప్రాంతపు నిమ్రూజ్ యొక్క రాజధాని.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సీస్తాన్&oldid=2885888" నుండి వెలికితీశారు