Jump to content

సుగంధ గర్గ్

వికీపీడియా నుండి
సుగంధ గర్గ్
ఆరక్షన్ సినిమా మీడియా ప్రివ్యూలో సుగంధ గర్గ్
2012లో సుగంధ గర్గ్
జననం
ఇతర పేర్లుసుగంధ రామ్
వృత్తినటి, టీవీ హోస్ట్, గాయని, దర్శకురాలు, ఫోటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2006; div. 2018)
[1]

సుగంధ గర్గ్‌ (ఆంగ్లం: Sugandha Garg; జననం 1982 మే 13)[2] ఒక భారతీయ నటి, గాయని. టెలివిజన్ హోస్ట్[3] కూడా అయిన ఆమె వెబ్ సిరీస్ గిల్టీ మైండ్స్‌లో నటించింది.

కెరీర్

[మార్చు]

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టిన ఆమె హైదరాబాదులో పెరిగింది. మీనా గర్గ్, శేఖర్‌ గర్గ్‌ ఆమె తల్లిదండ్రులు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మైత్రేయి కళాశాలలో సుగంధ గర్గ్ డిగ్రీ చదువుకుంది. పద్దెనిమిదేళ్ల వయసులోనే బీబీసీ చానెల్‌లో ఉద్యోగం వచ్చింది. హోస్ట్‌గా హాథ్‌ సే హాథ్‌ మిలా షో ని ఆమె నిర్వహించింది. ఫొటోగ్రఫీలోనూ శిక్షణ పొందింది. జానే తూ యా జానే నా సినిమాతో అరంగేట్రం చేసింది. తర్వాత లెట్స్ డాన్స్, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌ వంటి సినిమాలూ చేసింది.

తెరే బిన్‌ లాడెన్‌ తో మంచి గుర్తింపు రావడంతో అదే సినిమా సీక్వెల్లోనూ అవకాశం వచ్చింది. ది కైట్‌ – పతంగ్, కాఫీ బ్లూమ్‌ వంటి చిత్రాలతో ఆమె అంతర్జాతీయ ప్రేక్షకులకూ దగ్గరయింది. సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో వచ్చిన సిలోన్‌ తమిళ చిత్రంతో దక్షిణాది చిత్రసీమలోనూ మెరిసింది.

వ్యక్తిగత జీవతం

[మార్చు]

2006లో ఆమె టెలివిజన్ నిర్మాత, ఎం టీవీ రియాలిటీ షో హోస్ట్ రఘు రామ్‌ని వివాహం చేసుకున్నది. ఆ తరువాత వారు 2018 జనవరి 30న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
Year Film Role Notes
2008 జానే తూ... యా జానే నా షాలీన్
2009 లెట్స్ డాన్స్ అనౌష్క
2009 ముంబై కాలింగ్ TV సిరీస్
2010 మై నేమ్ ఈజ్ ఖాన్ కోమల్ (రిపోర్టర్)
2010 తేరే బిన్ లాడెన్ జోయా ఖాన్
2011 పతంగ్ ప్రియా
2014 సిలోన్ రజనీ ద్విభాషా చిత్రం (ఇంగ్లీష్, తమిళం)
2015 కాఫీ బ్లూమ్ అనికా
2016 తేరే బిన్ లాడెన్ 2 జోయా ఖాన్
2016 జుగ్ని విభావరి

వెబ్ సిరీస్

[మార్చు]
Year Series Role Language Platform Notes
2020 ఆర్య హేనా హిందీ డిస్నీ+ హాట్‌స్టార్
2022 గిల్టీ మైండ్స్ వందనా కథపాలియా హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో
2022 ఆర్య 2 హేనా హిందీ డిస్నీ+ హాట్‌స్టార్

మూలాలు

[మార్చు]
  1. Chaurasia, Ankita (6 January 2016). "Reason behind Raghu Ram-Sugandha Garg's divorce revealed". The Times of India. Retrieved 2016-09-06.
  2. "Raghu Ram wishes ex-wife Sugandha Garg on birthday, asks if son Rhythm can call her 'aunty' - Hindustan Times". web.archive.org. 2022-09-15. Archived from the original on 2022-09-15. Retrieved 2022-09-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Taran Adarsh (8 Feb 2010). "My Name Is Not Khan Review". Archived from the original on 20 మార్చి 2014. Retrieved 15 సెప్టెంబరు 2022.