సుగ్గునలంక
సుగ్గునలంక | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°14′01″N 80°48′50″E / 16.233567°N 80.813906°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కొల్లూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ చెన్నకేశవుల సాంబశివరావు |
పిన్ కోడ్ | 522301 |
ఎస్.టి.డి కోడ్ |
సుగ్గునలంక బాపట్ల జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చెన్నకేశవుల సాంబశివరావు, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ మారుమూల గ్రామానికి చెందిన సుగ్గున అశోక్ కుమార్, ఇటీవల ప్రకటించిన ఐ.సి.డబ్లు.ఏ. పరీక్షా ఫలితాలలో జాతీయస్థాయిలో మూడవ ర్యాంక్ సాధించాడు. ఇతని తల్లిదండ్రులు పద్మ, వెంకటరత్తయ్య, చదువంటే ఏమిటో తెలియని, ఒక సాధారణ రైతుకుటుంబానికి చెందిన వారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.