సుచేతా కడేత్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sucheta Kadethankar
Sucheta kadethankar.jpg
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయురాలు
జననం (1977-12-31) 1977 డిసెంబరు 31 (వయస్సు 43)
నివాసంపూణె, భారతదేశము
క్రీడ
దేశంIndia
క్రీడఎడారి అన్వేషణ
పోటీ(లు)గోబీ - 2011

సుచేతా కడేత్కర్ (మరాఠీ: सुचेता कडेठाणकर) (జననం. 1977 డిసెంబరు 31) పూణెకు చెందిన భారతీయురాలు. ఈమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కారకురాలు. ఈమె 2011 జూలై 15 న ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటారు[1][2][3] The 33[4] సంవత్సరాల వయసులోనే ఎడారి అన్వేషనలో 13 మంది సభ్యులకు నాయకత్వం వహించిన రిప్లీ డావెన్పోర్ట్తో కలసి వెళ్లారు.

సాహసం[మార్చు]

నిప్పులు చెరిగే ఎండ, వెన్ను వణికించే చలి, ఇసుక తుపాన్లతో నిండిన ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటారు. 1,623 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత 60 రోజులకంటే ముందుగానే.. 51 రోజుల్లో (జూలై 15న) దిగ్విజయంగా పూర్తిచేసుకుని సుచేత బృందం రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు పుటల్లోకి ఎక్కారు. రిప్లే డెవన్‌పోర్ట్ నేతృత్వంలోని 13 మంది బృందం గోబీ సాహసయాత్రకు మే 25న శ్రీకారం చుట్టింది. ఇందులో సుచేత కూడా సభ్యురాలు. ఆరోగ్య సమస్యలు, గాయాల బారినపడడంతో బృందంలోని ఆరుగురు సభ్యులు యాత్ర మధ్యలోనే వైదొలిగారు.

ఆమె ఐర్లాండ్‌కు చెందిన రిప్లే డెవన్‌పోర్ట్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందారు. భూటాన్ నుంచి పాకిస్థాన్ వరకు విస్తరించి ఉన్న హిమాలయాలను దాటడమే తన తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నారు.

ఆమె లక్ష్యాలు[మార్చు]

గోబీ యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని పుణేకు వచ్చిన సుచేత శనివారం మీడియాతో మాట్లాడుతూ..

‘‘గోబీ ఎడారి యాత్ర అత్యంత సాహసంతో కూడుకున్నది. మే 25న మంగోలియాలోని కొంగోరీన్ ఉత్తర ప్రాంతం నుంచి మా యాత్రను ప్రారంభించాం. రోజుకు సగటున 25 నుంచి 32 కిలోమీటర్ల దూరం నడిచాం. ఉదయం భరించలేని ఎండ, రాత్రిపూట భీకర చలిగాలులు, ఇక ఇసుక తుపాన్ల సంగతి సరేసరి. యాత్రలో ఎన్నో అడ్డంకులు. మధ్యలో అనారోగ్యానికి గురైనా త్వరలోనే తేరుకున్నా’’

—సుచేతా_కడేత్కర్

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Athavale, Ashlesha (31 July 2011). "Try Gobi for a change". Mumbai Mirror. Archived from the original on 3 అక్టోబర్ 2012. Retrieved 26 August 2011. Check date values in: |archive-date= (help)
  2. Athavale, Ashlesha (4 August 2011). "Breaking monotony at Gobi desert". The Times of India. Retrieved 26 August 2011.[permanent dead link]
  3. Ketkar, Swati (26 August 2011). "महिला विशेष - साद देती यशशिखरे". Loksatta. Retrieved 26 August 2011.[permanent dead link]
  4. Raghunath, Pamela (3 August 2011). "Desert horizons didn't sap her spirit". Gulfnews.com. Retrieved 26 August 2011.

ఇతర లింకులు[మార్చు]