ఎస్.జయరామరెడ్డి
Appearance
(సుజరె నుండి దారిమార్పు చెందింది)
సున్నపు రాళ్ల జయరామరెడ్డి (జ. 1933 మే 13) "సుజరె" గా సుపరిచితుడు. అతను భారతీయ హేతువాది, నాస్తికుడు, విమర్శకుడు. అతని రచనలలో ఎక్కువగా హేతువాదంతో కూడుకున్నవే ఉన్నాయి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1933 మే 13న ఆంధ్రప్రదేశ్ లోని జమ్మల మడుగులో జన్మించాడు. అతను తన వృత్తి జీవితాన్ని ఉపాధ్యాయునిగా ప్రారంభించాడు 1991లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పదవీవిరమణ చేసాడు. అతను అనంతపురం హేతువాద సంఘం స్థాపకుడు. తను "క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ రెలిజియన్స్" గ్రంథాన్ని రచించాడు. [2]
రచనలు
[మార్చు]- చైతన్యగీత 1986
- జనవేదం 1991
- సుజరె వచన గేయాలు 1995
- భావవిప్లవ జ్వాలలు 1996
- రామాయణం -వాస్తవికత 1997
- సత్యాన్వేషణ (స్వస్తత ప్రార్ధనలపై సవాల్ )1999
- పునర్జన్మ వృత్తాంతాలు 1999
- హేతువాదం 2000
- సుజరె జ్ఞాన దీపిక
మూలాలు
[మార్చు]- ↑ "సుజరె రచనలు మరువలేనివి - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
- ↑ [1] A critical analysis of religions, Sunnapurallapalli Jayarama Reddy