Jump to content

సుజాతనగర్ సోమేశ్వరస్వామి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°28′59″N 80°34′30″E / 17.483012°N 80.574933°E / 17.483012; 80.574933
వికీపీడియా నుండి
సుజాతనగర్‌ సోమేశ్వరస్వామి దేవాలయం
సుజాతనగర్‌ సోమేశ్వరస్వామి దేవాలయం is located in Telangana
సుజాతనగర్‌ సోమేశ్వరస్వామి దేవాలయం
సుజాతనగర్‌ సోమేశ్వరస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు:17°28′59″N 80°34′30″E / 17.483012°N 80.574933°E / 17.483012; 80.574933
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రదేశం:సుజాతనగర్, సుజాతనగర్ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:సోమేశ్వరస్వామి

సుజాతనగర్‌ సోమేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండల కేంద్రమైన సుజాతనగర్ ఉన్న దేవాలయం. ఉత్తర కాశీగా వెలుగొందుతున్న ఈ దేవాలయం గ్రామం చివరన 360 ఏళ్ళక్రితం వెలసింది. ఇక్కడి శివలింగం భూమిలో వెలసినందువలన, స్వయంభూ దేవాలయమని పిలుస్తున్నారు. ఈ దేవాలయానికి తూర్పున ఉన్న ఎదుళ్ళవాగు కాశీలో మాదిరిగా ఉత్తరం నుండి దక్షిణంగా ప్రవహిస్తోంది.

చరిత్ర

[మార్చు]

ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని తేరాల వంశస్తుడు సోమశేఖర గుప్త నిర్మించాడు. తేరాల వంశస్తుల ఐదోతరం వారసుడైన తేరాల సోమశేఖర గుప్త దంపతులకు చాలాకాలం వరకు పిల్లలు పుట్టలేదు. ఎన్నో దేవుళ్ళకు మొక్కినా ప్రయోజనం లేదు. ఒకరోజు అడవి నుండి వెళ్తున్న సోమశేఖర గుప్త ఒకచోట పడుకున్నాడు. ఆ సమయంలో శివుడు కలలో కనిపించి ‘నాకు పందిరి వేస్తే.. నీకు సంతాన భాగ్యం కలుగుతుంది’ అని చెప్పడంతో గుప్త అక్కడ పందిరి వేయించాడు. శివుడి ఆజ్ఞతో ఆ పందిరిలో లింగాకారం వెలసిందని చెబుతారు. పందిరి వేసిన ప్రదేశంలో దేవాలయ నిర్మాణం చేపట్టగా, సోమేశ్వర గుప్త పేరుమీదుగా స్వయంభూ సోమేశ్వరస్వామి దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం నిర్మాణం కోసం సోమేశ్వర గుప్త 30 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు.[1]

ప్రత్యేకత

[మార్చు]

ఈ దేవాలయం ముందుభాగంలో ఉత్తర వాహిని అయిన ఎదుళ్ళవాగు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకమాసంలో భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో పురాతన రావి చెట్టు ఉంది.

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు నిర్వహించబడుతాయి. ఆ వేడుకలకు కొత్తగూడెం, జూలూరుపాడు, చంద్రుగొండ మండలాల నుండి భక్తులు విచ్చేస్తారు.[2]

ఇతర వివరాలు

[మార్చు]

దేవాదాయ శాఖ 1965లో ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంది. బుచ్చయ్య శాస్త్రి వారసులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (13 November 2021). "దక్షిణ కాశి..ఉత్తర వాహిని!". Namasthe Telangana. కాగితం వెంకటేశ్వరరావు. Archived from the original on 14 November 2021. Retrieved 5 December 2021.
  2. ఈనాడు ఖమ్మం; 2014,ఫిబ్రవరి-25; 6వ పేజీ.