సుదర్శనం-గోవర్ధనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుదర్శనం-గోవర్ధనం తెలుగు సినిమాలలో ప్రసిద్ధిచెందిన జంట సంగీత దర్శకులు ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం. వీరు 1950 నుండి 1970 మధ్య రెండు దశాబ్దాల కాలం ఏ.వి.యం. సంస్థ నిర్మించిన కొన్ని తెలుగు చిత్రాలకు సంగీతం అందించి వాటి విజయానికి దోహదం చేశారు. కొన్ని చిత్రాలు చేశాన సుదర్శనం విడిపోయి ఆర్కెస్ట్రా మాత్రం నిర్వహించగా గోవర్ధనం స్వరాలు సమకూర్చారు.

జీవితం (1949) చిత్రంలో మాధవపెద్ది సత్యం చేత పాడించిన ఇదేనా మా దేశం, ఇదేనా భరతదేశం, వైజయింతిమాలపై చిత్రీకరించిన చక్కనైన కోయరాజును ఎక్కడైనా చూచారా, టి.ఆర్. రామచంద్రన్, వైజయింతిమాల పాడిన డడడా పాట ప్రాచుర్యం పొందాయి.

సంఘం (1954) చిత్రానికి వీరు స్వరపరచిన గీతాలన్నింటిలోను ఎన్నదగినవి సుందరాంగ మరువగలనోయీ రేయేల, అలాగే నాగయ్య గంభీరంగా ఆలపించిన జాతిభేద సమసిపోదా అన్న గీతం, పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పెళ్ళి పాట జనాన్ని ఆకర్షించార్యి.

విరు అందించిన సంగీతంలో తలమానికంగా ఎన్నదగిన చిత్రం భూకైలాస్ (1958). శ్రీరాముని అవతార విశేషాల్ని వివరించే రాముని అవతారం రఘుకుల సోముని అవతారం అన్న గీతం ఎన్నదగినది. రావణ పాత్రలో ఎన్.టి.ఆర్. శివుడిని స్తుతిస్తూ దేవదేవ ధవళాచాల మందిర అన్న గీతం దానితో ముడిపడ్డ అక్కినేని పై చిత్రీకరించిన నారాయణ హరి నమో నమో గీతం ఘంటసాల చేత అద్భుతంగా పలికించిన ఘనత వీరిదే. అదే చిత్రంలో రెండి వైవిధ్యమైన గీతాలు అందములు చిందు, హెలెన్ పై చిత్రీకరించిన సుందరాంగా అందుకోరా, కమలా లక్ష్మణ్ పై చిత్రీకరించిన మున్నేట పవళించు నాగశయనా అనే నృత్యగీతాలు చెప్పుకోదగ్గవి.

గోవర్ధనం ఇతర నిర్మాతలకు కూడా కొన్ని చిత్రాలు చేశారు. వాటిలో చెప్పుకోదగ్గవి కానిస్టేబుల్ కూతురు (1963). ఇందులోని కన్నుల్లో నీరెందుకు అన్న విషాదగీతం చిగురాకుల ఊయలలో యిలమరచిన ఓ చిలకా అన్న ఆప్త గీతం బాగున్నవి.

వీరి జంట సంగీతం అందించిన చిత్రాలు ఇరవై మాత్రమే అయినా వాసిలో అవి చిరస్మరణీయమైనవి.